గగనతలంలో గుర్తు తెలియని డ్రోన్లు.. ఎయిర్‌పోర్టు మూసివేత Imphal Airport Shut After Unidentified Drones Detected in Airspace | Sakshi
Sakshi News home page

గగనతలంలో గుర్తు తెలియని డ్రోన్లు.. ఎయిర్‌పోర్టు మూసివేత

Published Sun, Nov 19 2023 7:25 PM | Last Updated on Sun, Nov 19 2023 7:50 PM

Imphal Airport Shut After Unidentified Drones Detected in Airspace - Sakshi

ఇంఫాల్‌: గగనతలంలో గుర్తు తెలియని డ్రోన్లు కనిపించడంతో మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌లో విమానాశ్రయాన్ని అధికారులు మూసివేశారు. బిర్‌ టికేంద్రజిత్‌ అంతర్జాతీయ  విమానాశ్రయం గగనతంలలో ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు  గుర్తు తెలియని డ్రోన్లు ఎగురుతుండటం గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఆ విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన పలు విమానాలను రద్దు చేశారు. అదే విధంగా ఇంఫాల్‌కు రావాల్సిన విమానాలను సైతం ఇతర ఎయిర్‌పోర్టులకు మళ్లించారు.

అల్లర్లు, హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో ఈ సంఘటన జరిగింది. శాంతిభద్రతలు అదుపులోకి రాకపోవడంతో మణిపూర్‌లో ఇంటర్నెట్‌ సేవలపై నిషేధాన్ని ప్రభుత్వం మరో అయిదు రోజులు(నవంబర్‌ 23 వరకు) పొడిగించిన నేపథ్యంలో ఈ సంఘటన వెలుగుచూడటం గమనార్హం. అల్లర్లు, హింసాత్మక ఘటనలతో మణిపూర్‌ అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే.

ఈ ఏడాది మే 3నుంచి మైతీ, కుకీ తెగల మధ్య చెలరేగిన ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు  సుమారు  200 మంది  ప్రాణాలు  కోల్పోగా  కనీసం  50వేల మంది నిరాశ్రయులయ్యారు.మైతీ వర్గానికి ఎస్టీ హోదా కల్పించేందుకు ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే కొండ ప్రాంతాల్లో అత్యధికంగా నివసించే కుకీ వర్గం ప్రజలు దీనిని వ్యతిరేకించారు.  నాటి నుంచి ఇరు వర్గాల మధ్య ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement