High Court of Manipur Orders Govt To Lift Internet Ban - Sakshi
Sakshi News home page

ఇంటర్నెట్‌ బ్యాన్‌ ఎత్తేయండి.. మణిపూర్‌ సర్కార్‌కు హైకోర్టు కీలక ఆదేశాలు

Published Sat, Jul 8 2023 6:16 PM | Last Updated on Sat, Jul 8 2023 6:28 PM

High Court of Manipur Orders Govt To Lift Internet Ban - Sakshi

ఇంఫాల్‌: గిరిజనలు.. గిరిజనేతర వర్గపోరుతో మొదలైన అలర్లు.. హింసతో అట్టుడికిపోతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో ఉన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇంటర్నెట్‌ నిషేధాన్ని ఎత్తేయాలంటూ శనివారం బీరెన్‌ సింగ్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రెండు నెలలుగా అక్కడ నిషేధం అమలులో ఉంది.

మే 3వ తేదీ నుంచి మణిపూర్‌లో సమస్యాత్మక ప్రాంతాల్లో ఇంటర్నెట్‌పై నిషేధం విధించి.. ఆ బ్యాన్‌ను కొనసాగిస్తూ వస్తోంది ప్రభుత్వం. ఈ క్రమంలో ఇంటర్నెట్‌ బ్యాన్‌ ఎత్తేయాలని.. కనీసం పాక్షికంగా అయినా నిషేధం ఎత్తివేసి పరిమితంగా అయినా సేవలను అందించాలని ప్రభుత్వాన్ని తన ఆదేశాల్లో పేర్కొంది హైకోర్టు. పైగా రాష్ట్రంలో లీజుకు తీసుకున్న లైన్లు, ఫైబర్ ఆప్టిక్ కనెక్షన్లు ఉన్నవాళ్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. వాళ్లకు ఇంటర్నెట్ యాక్సెస్‌ను అనుమతించాలని పేర్కొంది. 

పర్వత ప్రాంతాల్లో నివసించే కుకీ తెగ.. లోయ ఏరియాల్లో నివసించే మెయితీస్‌ల మధ్య ఘర్షణలు.. మణిపూర్‌ను రణరంగంగా మార్చేశాయి. తప్పుడు సమాచారం ద్వారా హింస ప్రజ్వరిల్లే అవకాశం ఉందంటూ మే 3వ తేదీ నుంచి ఇంటర్నెట్‌ను బ్యాన్‌ చేసి.. పలుమార్లు ఆ నిషేధాన్ని పొడిగించుకుంటూ వస్తోంది బీరెన్‌ సింగ్‌ ప్రభుత్వం. అయితే.. హింసతో ప్రాణాలు పోవడం మాత్రం ఆగడం లేదక్కడ. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement