ఆత్మగౌరవం గురించి బాపూజీ ఏమన్నారు? | Gandhi Jayanti 2023 Special Story: List Of 10 Best Quotes About Self Respect By Mahatma Gandhi In Telugu - Sakshi
Sakshi News home page

Mahatma Gandhi Telugu Quotes: ఆత్మగౌరవం గురించి బాపూజీ ఏమన్నారు?

Published Sat, Sep 30 2023 12:05 PM | Last Updated on Sat, Sep 30 2023 12:20 PM

Gandhi Jayanti Mahatma Gandhi Quotes - Sakshi

సత్యం, అహింసల మార్గాన్ని అనుసరించి భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీ. అక్టొబరు 2న జాతిపిత జన్మదినం. ప్రపంచంలోని చాలా మంది ప్రముఖులు నేటికీ గాంధీజీని తమ స్ఫూర్తిదాతగా భావిస్తారు. గాంధీజీలోని నాయకత్వ లక్షణాలు, అనుసరించిన విలువలు, ఆయన గుణగణాలు దేశాన్ని ఏకం చేయడానికి దోహదపడ్డాయి. 

  • బాపుజీ అనుసరించిన జీవన శైలిని నేటికీ విజయానికి ఉత్తమమైన మార్గంగా పరిగణిస్తారు. జాతిపిత జన్మదినోత్సవం సందర్భంగా ‍ప్రతీఒక్కరికీ ఉపకరించే గాంధీజీ బోధనలలోని కొన్నింటిని ఇప్పుడు తెలుసుకుందాం. 
  • వ్యక్తి ఆలోచనలే అతనిని తీర్చిదిద్దుతాయి. అందుకే మనం ఏమనుకుంటామో అదే అవుతాం. 
  • మనం చేసే ఏ ఒక్క పని అయినా ఎవరికైనా సంతోషాన్ని కలిగించగలిగితే, అది వేలమంది తలలు వంచి చేసే ప్రార్థన కన్నా ఉత్తమమైనది.
  • జీవితంలో చాలా సార్లు ప్రత్యర్థిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఎదుటివారిని ప్రేమతో గెలిచే ప్రయత్నం చేయాలి.
  • ఈ ప్రపంచంలో నిజమైన శాంతి నెలకొనాలంటే యుద్ధానికి వ్యతిరేకంగా నిజమైన పోరాటం జరగాలి. దీనిని మనం మన పిల్లలతోనే ప్రారంభించాలి. అప్పుడే నిజమైన శాంతి వర్ధిల్లుతుంది.
  • ఈ భూమిపై ఎప్పటికీ జీవించాలి అన్నట్లుగా మీ జీవితాన్ని మలచుకోండి.
  • బలం అనేది శారీరక సామర్థ్యాల నుండి కాదు.. అసమానమైన సంకల్ప శక్తి నుండి సమకూరుతుంది. కాబట్టి మీ సంకల్ప శక్తిని బలంగా ఉండనివ్వండి.
  • ఎవరినైనా కోల్పోయే వరకు వారి ప్రాముఖ్యతను చాలామంది అర్థం చేసుకోలేరు. అందుకే ముందుగానే ఎదుటివారి ప్రాముఖ్యతను అర్థం చేసుకోండి.
  • ఏదైనా పని చేసే ముందే దానిగురించి ఆలోచించండి. పని చేసిన తరువాత మీరు ఎంత ప్రయత్నించినా, మీ  పనుల ఫలితాలు ఎలా ఉంటాయో ఎప్పటికీ తెలుసుకోలేరు. అందుకే మీరు చేసే పనిపైన మాత్రమే దృష్టి పెట్టండి.
  • ఎవరైనా సరే ఆత్మగౌరవాన్ని పోగొట్టుకోవడం కంటే పెద్ద నష్టం మరొకటి లేదు. అందుకే మీ ఆత్మగౌరవాన్ని మీరే కాపాడుకోండి.

ఇది కూడా చదవండి: త్వరలో ప్రతి రైలులో ‘పాతాళ గంగ’.. అడక్కుండానే వాడుక నీరు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement