తండ్రికి అంత్యక్రియలు చేసిన కుమార్తెలు Father Death: 9 Daughters Performing Last Rituals | Sakshi
Sakshi News home page

Madhya Pradesh: తండ్రికి అంత్యక్రియలు చేసిన కుమార్తెలు

Published Wed, Feb 28 2024 10:05 AM | Last Updated on Wed, Feb 28 2024 10:25 AM

Father Death 9 Daughters Performing Last Rituals - Sakshi

మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌లో ఆసక్తికర ఉదంతం చోటుచేసుకుంది. సంప్రదాయం పేరిట కొనసాగుతున్న తరతరాల ఆచారాన్ని కాదంటూ తొమ్మిదిమంది కుమార్తెలు తమ తండ్రి చితికి నిప్పంటించారు. ఈ ఘటన స్థానికంగా చర్చాంశనీయంగా మారింది. 

వివరాల్లోకి వెళితే బుందేల్‌ఖండ్‌ పరిధిలోని సాగర్‌లో రిటైర్డ్ పోలీసు హరిశ్చంద్ర అహిర్వార్ ఉంటున్నారు. అతనికి తొమ్మిది మంది కుమార్తెలు. కొడుకులు లేరు. వీరిలో ఏడుగురికి వివాహాలయ్యాయి. మరో ఇద్దరు కుమార్తెలకు వివాహం జరగాల్సివుంది. అయితే హరిశ్చంద్ర అహిర్వార్ అకస్మాత్తుగా  బ్రెయిన్ హెమరేజ్‌కు గురై ఆసుపత్రిలో కన్నుమూశాడు. ఈ నేపధ్యంలో అతని కుమార్తెలు తమ తండ్రికి తామే అంత్యక్రియలు చేయాలని నిర్ణయించుకున్నారు. వారందరూ అంతిమయాత్రలో పాల్గొని, ముక్తిధామ్‌లో తండ్రికి అంత్యక్రియలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో స్థానికులు ఈ అంత్యక్రియలకు హాజరయ్యారు.

హరిశ్చంద్ర అహిర్వార్ బంధువు ఛోటాలాల్ అహిర్వార్ మాట్లాడుతూ కుమార్తెలు తమ తండ్రికి హిందూ ఆచార సంప్రదాయాలను అనుసరిస్తూ అంత్యక్రియలు నిర్వహించారు. హరిశ్చంద్ర అహిర్వార్ తన ఏడుగురు కుమార్తెలకు వివాహాలు చేశారని, ఇంకా రోష్ని, గుడియాలకు వివాహాలు చేయాల్సివుందని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement