Vedio: 'బస్సు కింద పడి చచ్చిపో..' బైకర్‌పై దేవెగౌడ కోడలు ఆగ్రహం | Deve Gowda Daughter in Law Yells At Villagers Over Damaged Car | Sakshi
Sakshi News home page

Vedio: 'బస్సు కింద పడి చచ్చిపో..' బైకర్‌పై దేవెగౌడ కోడలు ఆగ్రహం

Published Mon, Dec 4 2023 7:18 PM | Last Updated on Mon, Dec 4 2023 8:17 PM

Deve Gowda Daughter in Law Yells At Villagers Over Damaged Car  - Sakshi

బెంగళూరు: కర్ణాటకకు చెందిన మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ్ కోడలు ఓ బైకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కారును ఢీకొట్టిన ద్విచక్రవాహనదారునిపై కోపంతో రంకెలు వేశారు. కారు విలువ రూ.1.5 కోట్లు అని పదే పదే పేర్కొంటూ బైకర్‌ని చివాట్లు పెడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

దేవెగౌడ కోడలు భవాని రేవణ్ణ స్వగ్రామం ఉడిపిలోని సాలిగ్రామానికి వెళ్లి వస్తుండగా.. ఓ బైకర్ ఆమె కారును ఓవర్‌టేర్‌ చేసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో రేవణ్ణ కారు టొయేటా వెల్‌ఫైర్‌ను బైకర్‌ ఢీకొట్టాడు. దీంతో భవాని రేవన్న అతనిపై కోపంతో ఊగిపోయారు. తన కారు విలువ రూ.1.5 కోట్లు.. రిపేర్‌కు రూ.50 లక్షలు ఇవ్వగలవా? అని అతనిపై రంకెలు వేశారు. చనిపోవాలనుకుంటే.. ఏ బస్సు కిందో పడి చావొచ్చుగా? రాంగ్ సైడ్‌లో ఎందుకు డ్రైవ్ చేస్తున్నావని అతనిపై మండిపడ్డారు. 

బైకర్‌ని తిట్టే క్రమంలో భవాని రేవణ్ణ కారు విలువ రూ.1.5 కోట్లు అని పదే పదే చెప్పారు. దీనిపై కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవానీ రేవన్నకు మరికొందరు మద్దతు కూడా తెలుతున్నారు. రైడర్ రాంగ్ సైడ్‌లో డ్రైవ్ చేయడం తప్పుకదా? అని ప్రశ్నిస్తున్నారు. భవానీ రేవన్న భర్త హెచ్‌డీ రేవన్న ప్రస్తుతం ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. ఆమె కుమారులు ప్రజ్వాల్, సూరజ్ రేవన్న ఎంపీ, ఎమ్మెల్సీ పదవుల్లో ఉన్నారు.  

ఇదీ చదవండి:  కాంగ్రెస్‌ చేసిన తప్పు అదేనా?


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement