ముగిసిన ఆతిశి నిరాహార దీక్ష Delhi Water Minister Atishi being taken to LNJP Hospital due to deteriorating health | Sakshi
Sakshi News home page

ముగిసిన ఆతిశి నిరాహార దీక్ష

Published Wed, Jun 26 2024 3:33 AM | Last Updated on Wed, Jun 26 2024 11:43 AM

Delhi Water Minister Atishi being taken to LNJP Hospital due to deteriorating health

అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఢిల్లీ మంత్రి 

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నీటి సమస్యను పరిష్కరించాలంటూ ఈనెల 21వ తేదీ నుంచి మంత్రి ఆతిశి కొనసాగిస్తున్న నిరాహార దీక్ష అర్ధంతరంగా ముగిసింది. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆమెను లోక్‌నాయక్‌ ఆస్పత్రిలో చేర్పించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న మంత్రి ఆతిశి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు ఆస్పత్రి మెడికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సురేశ్‌ కుమార్‌ తెలిపారు.

అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన మంత్రి ఆతిశి దాదాపు ఐదు రోజులుగా సాగిస్తున్న నిరాహార దీక్షను విరమించారని ఆప్‌ రాజ్యసభ ఎంపీ సంజయ్‌ సింగ్‌ చెప్పారు. ఢిల్లీకి న్యాయబద్ధంగా అందాల్సిన నీటిని హరియాణా నుంచి విడుదల చేయించాలంటూ ప్రధానికి ఆప్‌ ఎంపీలు లేఖ రాస్తారన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement