27 వారాల గర్భవిచ్చిత్తి​కి అనుమతి.. భర్త మృతితో తీవ్ర.. Delhi HC Allows Woman To End Pregnancy Over Trauma After Husband Death | Sakshi
Sakshi News home page

27 వారాల గర్భవిచ్చిత్తి​కి అనుమతి.. భర్త మృతితో తీవ్ర మానసిక సమస్య

Published Fri, Jan 5 2024 11:06 AM | Last Updated on Fri, Jan 5 2024 4:57 PM

Delhi HC Allows Woman To End Pregnancy Over Trauma After Husband Death - Sakshi

ఢిల్లీ:  గర్భం వద్దని కోర్టును ఆశ్రయించిన ఓ మహిళా పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. సదరు మహిళ 27 వారాల గర్భవిచ్చిత్తికి ఢిల్లీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. భర్త మరణించిన ఓ మహిళ తనకు తీవ్రమైన మానసిక సమస్యలు ఉన్నాయని.. 27 వారాల అబార్షన్‌ను అనుమతించాలని దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది.

పిటిషిన దాఖలు చేసిన మహిళ ఒక వితంతువని ఢిల్లీ ఎయిమ్స్‌ ఇచ్చిన నివేదిక ప్రకారం ఆమె తన భర్తను కోల్పోవడంతో తీవ్రమైన మానసిక సమస్యతో బాధపడుతోందని ఢిల్లీ హైకోర్టు జస్టిస్‌ సుబ్రహ్మణ్యం ప్రసాద్‌ అన్నారు. అయితే ఆమె మానసికస్థితి సరిగా లేనందున, ముఖ్యంగా ఆమె గర్భంతో ఉంటే తనకు తాను హాని చేసుకునే అవకాశం ఉన్నట్లు నివేదికలు తెలుపుతున్నాయని పేర్కొన్నారు. 

ఈ కారణంగా ఆమెకు 27 వారాల గర్భవిచ్చిత్తికి ఢిల్లీ హైకోర్టు అనుతిస్తున్నట్లు జస్టిస్‌ సుబ్రహ్మణ్యం ప్రసాద్‌ తీర్పు వెల్లడించారు. దీంతోపాటు.. గర్భంతో 24 వారాలు దాటినప్పటికీ సదరు మహిళకు అబార్షన్‌ చేయాలని ఎయిమ్స్‌ ఆస్పత్రిని ఢిల్లీ కోర్టు కోరింది.

చదవండి: బెంగళూరులో కరోనా డేంజర్‌ బెల్స్‌.. నాలుగు మరణాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement