Coronavirus Omicron BF7 Variant Updates: Karnataka Govt Announces Free Treatment For Patients - Sakshi
Sakshi News home page

Corona New Variant BF.7: కరోనా బీఎఫ్.7 బాధితులకు పైసా ఖర్చు లేకుండా చికిత్స.. ఎక్కడంటే? 

Published Tue, Dec 27 2022 12:32 PM | Last Updated on Tue, Dec 27 2022 1:07 PM

Coronavirus Omicron Bf7 Variant Karnataka Announces Free Treatment - Sakshi

బెంగళూరు: దేశంలో కరోనా ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బీఎఫ్.7 వెలుగుచూసిన నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యాధి సోకిన రోగులకు పైసా ఖర్చు లేకుండా మెరుగైన వైద్యం అందించనున్నట్లు తెలిపింది. రెవెన్యూ మంత్రి  ఆర్ ఆశోక ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

బీఎఫ్‌.7 వేరియంట్ సోకిన బాధితుల కోసం ప్రత్యేకంగా రెండు ఆస్పత్రులు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. బెంగళూరులోని విక్టోరియా హాస్పిటల్, మంగళూరులోని వెన్‌లాక్ హాస్పిటల్‌లో చికిత్స అందించనున్నట్లు చెప్పారు.

అలాగే కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా ప్రజలు కచ్చితంగా కరోనా మార్గదర్శకాలు పాటించాలని ఆశోక స్పష్టం చేశారు. బహిరంగ ప్రదేశాలు, బార్‌లు, పబ్‌లు, హోటళ్లలో అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు. అర్ధ రాత్రి ఒంటి గంట వరకే వేడుకలకు అనుమతి ఉంటుందని చెప్పారు.
చదవండి: ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు అస్వస్థత.. ఎయిమ్స్‌లో చేరిక

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement