రెచ్చిపోయిన ఇసుక మాఫియా.. ట్రాక్టర్‌తో తొక్కించి ఏఎస్‌ఐ హత్య | Cop Run Over By Sand Mafia Tractor In Madhya Pradesh 2 Arrested | Sakshi
Sakshi News home page

రెచ్చిపోయిన ఇసుక మాఫియా.. ట్రాక్టర్‌తో తొక్కించి ఏఎస్‌ఐ హత్య

Published Sun, May 5 2024 3:20 PM | Last Updated on Sun, May 5 2024 5:33 PM

Cop Run Over By Sand Mafia Tractor In Madhya Pradesh 2 Arrested

ఇసుక మాఫియా రోజురుజుకీ రెచ్చిపోతుంది. వారి రాచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. అక్రమంగా ఇసుక తరలించి సొమ్ము చేసుకోవడం, ఎవరైనా అడ్డొస్తే ప్రాణాలు తీయడం అలవాటుగా మారింది. తాజాగా  మధ్యప్రదేశ్‌లో షాదోల్ జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలకు మరో పోలీస్‌ అధికారి బలయ్యారు. అక్రమ మైనింగ్‌ను తనిఖీ చేసేందుకు వెళ్లిన పోలీస్‌ అధికారిని ట్రాక్టర్‌తో తొక్కి చంపేశారు.

ఈ హేమమైన ఘటన మధ్యప్రదేశ్‌లోని షాడోల్‌లో చోటుచేసుకుంది. షాడోల్ అసిస్టెంట్‌ ఎస్సై  మహేంద్ర బగ్రీ, ఇద్దరు కానిస్టేబుల్స్‌ ప్రసాద్‌ కానోజి, సంజరు దూబేలతో కలిసి శనివారం ఘటనా ప్రాంతానికి అక్రమ మైనింగ్‌ తనిఖీకి వెళ్లారు. ఈ సమయంలో వేగంగా వస్తున్న ఓ ఇసుక అక్రమ తరలింపు చేస్తున్న ట్రాక్టర్‌ను ఆపేందుకు యత్నించగా.. డ్రైవర్ దానిని ఆయనపై నుంచి పోనిచ్చాడు. ఆయనను తొక్కుకుంటూ వెళ్లడంతో తీవ్రంగా గాయపడిన మహేంద్ర బగ్రీ అక్కడికక్కడే  ప్రాణాలు విడిచాడు.

ఇద్దరు కానిస్టేబుళ్లు తృటిలో తప్పించుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ట్రాక్టర్‌ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో  ఇసుక అక్రమ తరలింపులో ట్రాక్టర్‌ ఓనర్‌, ఆయన కుమారుడికి పాత్ర ఉన్నట్లు తేలింది. దాంతో ట్రాక్టర్‌ ఓనర్‌ కుమారుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న ట్రాక్టర్‌ ఓనర్‌ కోసం గాలిస్తున్నారు.

ఇసుక అక్రమ తరలింపును అడ్డుకునేందుకు వెళ్లిన ఎస్సై మహేంద్ర బాగ్రీని ట్రాక్టర్‌తో తొక్కించి చంపేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement