సీనియర్‌ సిటిజన్లు, మహిళలకు సెల్యూట్‌: ఈసీ CEC Rajiv Kumar Comments Over Election Counting Process | Sakshi
Sakshi News home page

సీనియర్‌ సిటిజన్లు, మహిళలకు సెల్యూట్‌.. ఫస్ట్‌ టైం ఓటర్లకు ఈసీ స్టాండింగ్‌ ఒవేషన్‌

Published Mon, Jun 3 2024 12:53 PM | Last Updated on Mon, Jun 3 2024 2:59 PM

CEC Rajiv Kumar Comments Over Election Counting Process

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం చరిత్రలోనే అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. ఓటర్లకు స్టాండింగ్‌ ఒవేషన్‌(లేచి చప్పట్లు కొట్టడం) ఇచ్చారు ఈసీ సభ్యులు. రేపు ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్న నేపథ్యంలో ఇవాళ సీఈసీ రాజీవ్‌కుమార్‌ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. 

ఈ సందర్భంగా.. ‘దేశంలో జరిగిన ఎన్నికల్లో ఓటు వేసిన సీనియర్‌ సిటిజన్స్‌, మహిళలకు తాము సెల్యూట్‌ చేస్తున్నామని కేంద్రం ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్‌ కుమార్‌ చెప్పారు. ఈ క్రమంలో ప్రెస్‌మీట్‌లోనే ఆయన ఓటర్లకు స్టాండింగ్‌ ఓయేషన్‌ ఇచ్చారు. 

 

 

ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో మొత్తం 642 మిలియన్ల ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏడు విడతలుగా పోలింగ్‌ విజయవంతంగా జరిగింది. రికార్డు స్థాయిలో ఓటర్లు ఓటు వేశారు. ఓటింగ్‌లో భారత్‌ వరల్డ్‌ రికార్డు సృష్టించింది. ప్రపంచంలోనే మన దేశంలో 31 కోట్ల మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మన దేశంలో ఓటేసిన వారి సంఖ్య.. జీ-7 దేశాల జనాభాకు ఒకటిన్నర రేట్లు ఎక్కువ. జమ్మూ కశ్మీర్‌లో నాలుగు దశాబ్ధాల్లో జరగనంత పోలింగ్‌ జరిగింది. 

 

 

పోలింగ్‌ సందర్భంగా ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్‌ ప్రశాంతంగా జరిగిందన్నారు. కేవలం రెండు రాష్ట్రా‍ల్లోనే 39 ప్రాంతాల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. అక్కడే రీపోలింగ్‌ అవసరముందన్నారు. 27 రాష్ట్రాల్లో రీపోలింగ్‌ నిర్వహించాల్సిన అవసరం లేదన్నారు. మరోవైపు రేపు దేశవ్యాప్తంగా కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశామని, కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని చెప్పారాయన. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement