పోలీసుల వేధింపులు?.. రెండు రోజుల వ్య‌వ‌ధిలో సోద‌రుల ఆత్మ‌హ‌త్య‌ | UP Brothers Dies By Suicide After Alleged Police Harassment, More Details Inside | Sakshi
Sakshi News home page

పోలీసుల వేధింపులు?.. రెండు రోజుల వ్య‌వ‌ధిలో సోద‌రుల ఆత్మ‌హ‌త్య‌

Published Tue, Jun 25 2024 2:12 PM | Last Updated on Tue, Jun 25 2024 4:31 PM

UP Brothers Dies By Suicide After Alleged Police Harassment

ల‌క్నో: పోలీసుల వేధింపుల‌కు రెండు ప్రాణాలు బ‌ల‌య్యాయి. హ‌త్రాస్ పోలీసుల వేధింపుల‌తో రెండు రోజుల‌ వ్య‌వ‌ధిలో ఇద్ద‌రు సోద‌రులు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు.  ముందుగా త‌మ్ముడు సంజ‌య్ అనే ఆత్మ‌హ‌త్య చేసుకున్న రెండు రోజుల‌కు ఆగ్రా స‌మ‌మీపంలోని ఓ గ్రామంలో చెట్టుకు ఉరేసుకొని సోద‌రుడు ప్ర‌మోద్ సింగ్ అనే వ్య‌క్తి బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు.

కాగా జూన్ 9న అతని బావమరిది లక్ష్మణ్ గ్రామంలోని ఒక మహిళతో పారిపోవ‌డంతో పోలీసులు సంజయ్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంత‌రం జూన్ 13న ప్రమోద్‌ను విచారించారు. అయితే కస్టడీలో ఉన్న సంజ‌య్‌ను కొందరు పోలీసు అధికారులు కొట్టారని, వారు  అత‌ని నుంచి రూ.  1 లక్ష డిమాండ్ చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ముందుగా ప‌దివేలు క‌ట్టి, మిగ‌తా 90 వేలు చెల్లిస్తామ‌ని హామీ ఇవ్వ‌డంతో సంజ‌య్‌ను విడుద‌ల చేశార‌ని తెలిపారు.

అనంత‌రం జూన్ 22 న సంజ‌య్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. అయితే పోలీసు అధికారులు నిరంత‌రం వేధింపుల‌కు గురిచేయ‌డం, పోలీస్ స్టేష‌న్‌కు పిలపించి బెదిరింపుల‌కు పాల్ప‌డ‌టంతో మ‌నస్తాపం చెందిన సంజయ్ చ‌నిపోయాడ‌ని కుటుంబీకులు ఆరోపించారు.

సంజయ్ మరించిన త‌ర్వాత  ప్ర‌మోద్‌ను పోలీసులు మ‌ళ్లీ విచార‌ణ‌కు పిలించారు. దీంతో అత‌డు కూడా సోమ‌వారం చెట్టుకు ఉరేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. తన సోదరుడి ఆత్మహత్యపై ఫిర్యాదు చేయవద్దని ప్రమోద్‌ను పోలీసులు హెచ్చరించినట్లు కుటుంబ సభ్యుడు ఆరోపించారు. కాగా జంట ఆత్మహత్యలపై గ్రామంలో ఉద్రిక్తత నెలకొనడంతో  పోలీసులు భద్రతను పెంచారు.

సుసైడ్‌కు ముందు హత్రాస్‌లోని సాదాబాద్ పోలీస్ స్టేషన్‌లో కొంతమంది అధికారులను త‌న‌ను వేధింపులకు గురిచేస్తున్నట్లు ప్రమోద్ సింగ్  ఓ లేఖ రాశారు. దీని ఆధారంగా కుటుంబ స‌భ్యులు ఫిర్యాదు చేయ‌గా.. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు ప్రారంభించారు. ఓ అధికారి అగ్నిహోత్రిని సస్పెండ్ చేయ‌గా.. మ‌రో అధికారి కుమార్‌ను బదిలీ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement