Beer, Wine Can Now Be Served In Haryana's Corporate Offices - Sakshi
Sakshi News home page

Haryana Excise Policy 2023-24: అక్కడ ఆఫీసుల్లో కూడా బీర్‌, వైన్‌ సర్వ్‌ చేస్తారట!

Published Sun, May 14 2023 3:58 PM | Last Updated on Sun, May 14 2023 5:30 PM

Beer, Wine Can Now Be Served In Haryanas Corporate Offices - Sakshi

ఆ రాష్ట్రంలోని కార్యాలయాల్లో(ఆఫీసుల్లో) బీర్‌, వైన్‌ సర్వ్‌ చేసేలా అనుమితించడం కోసం ప్రత్యేక పాలసీని కూడా తీసుకొచ్చారు. ఈ పాలసీ ప్రకారం అన్ని కార్పొరేటే కార్యాలయాల్లో వైన్‌, బీర్‌ వంటి తక్కువ కంటెంట్‌ ఆల్కహాల్‌ డ్రింక్స్‌ని సర్వ్‌ చేసేలా అనుమితిస్తున్నారు. ఈ పాలసీ నిబంధన ప్రకారం కార్పోరేట్‌ కార్యాలయాల్లో సుమారు 2 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో క్యాంటీన్‌ లేదా తినుబండరాలు ఉండాలి.

ఈ మేరకు గురుగ్రామ్‌ లేదా హర్యానాలోని అక్కడ క్యాబినేట్‌ మంగళవారం ఈ క్తొత పాలసీ 2023-24కి ఆమోదం తెలిపింది. రిటైల్‌ పర్మిట్‌ రుసుము కింద పర్యావరణం, జంతు సంక్షేమ నిధి కోసం రూ. 400 కోట్లను సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం తర్వాత విడదల చేసిన అధికారిక ప్రకటనలో దీని గురించి తెలిపారు. 

హర్యానా కొత్త మద్యం పాలసీలో ముఖ్యాంశాలు

  • కొత్త పాలసీలో దేశీయ మద్యం, ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్, ఇంపోర్టెడ్ ఫారిన్ లిక్కర్ బేసిక్ కోటా పెరిగింది. దీంతో దేశీయ మద్యం, IMFL పై ఎక్సైజ్ సుంకం రేట్లలో నామమాత్రపు పెరుగుదల మాత్రమే ఉంది. ఈ పెంపుదలతో ఎక్సైజ్ ఆదాయానికి పెద్దపీట వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
  • వ్యాపారం చేసే సౌలభ్యం కోసం, కొత్త విధానంలో, జిల్లా స్థాయిలో IFL (BIO) లేబుల్‌లను పునరుద్ధరించింది. అలాగే సూక్ష్మ మధ్య తరహా రంగాన్ని ప్రోత్సహించడానికి చిన్న షాపులకు లైసెన్స్ ఫీజును తగ్గించింది.
  • రాష్ట్రంలో వైన్ తయారీ కేంద్రాలను ప్రోత్సహించేందుకు వైన్ తయారీ కేంద్రాల పర్యవేక్షక రుసుమును తగ్గించినట్లు ప్రకటనలో తెలిపారు. పంచకులలోని శ్రీ మాతా మానస దేవి ఆలయం చుట్టుపక్కల నోటిఫై చేయబడిన పవిత్ర ప్రాంతాలు,  గురుకులాలు ఉన్న గ్రామాలలో మద్యం దుకాణాలు తెరవకూడదని నిర్ణయించినట్లు ప్రకటన పేర్కొంది.
  • తక్కువ ఆల్కహాల్ కంటెంట్ ఉన్న పానీయాలను ప్రోత్సహించడానికి, మైల్డ్, సూపర్ మైల్డ్ కేటగిరీల కింద సిద్ధంగా ఉన్న పానీయాలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది.
  • పబ్ కేటగిరీలో బీర్, వైన్ వినియోగానికి మాత్రమే లైసెన్స్ ఫీజు మరింతగా తగ్గించింది.

(చదవండి: మరో భారత్‌ జోడో యాత్రకు కాంగ్రెస్‌ సన్నాహాలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement