Anand Mahindra Advice Overcoming Obstacles By An Elephant Video - Sakshi
Sakshi News home page

అవరోధాన్ని ఏనుగులా దాటండి.. ఆనంద్ మహీంద్రా వీడియో వైరల్‌.. నెటిజన్లు ఫిదా..!

Published Fri, Aug 4 2023 8:59 PM | Last Updated on Thu, Aug 10 2023 7:01 PM

Anand Mahindra Advice Overcoming Obstacles By An Elephant Video - Sakshi

ఆనంద్ మహీంద్రా ఎప్పుడూ తన ఫాలోవర్స్‌ను ఆలోచింపజేస్తూనే ఉంటారు. స్పూర్తిదాయకమైన పోస్టులతో తన అనుచరులను ఆలోచింపజేస్తుంటారు. వ్యాపారలావాదేవీలతో బీజీగా గడుపుతున్నప్పటికీ ఏదో ఒక విధంగా మంచి పోస్టులతో నెటిజన్లను మేల్కొలుపుతారు. తాజాగా ఇలాంటి వీడియోనే సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఏనుగును చూసి ప్రతికూలతలను అధిగమించడం ఎలాగో నేర్చుకోండి అంటూ ఓ వీడియోను షేర్ చేశారు. 

ఈ వీడియోలో ఓ ఏనుగు కంచెను దాటుతుంది. ఫెన్సింగ్‌ను దాటడానికి అది అనుసరించిన విధానం అందరికీ ఆదర్శం అంటూ ఆనంద్ మహీంద్రా తన అభిప్రాయాన్ని షేర్ చేశారు. ఆ ఏనుగు ఫెన్సింగ్  చాల చాకచక్యంగా దాటుతుంది. కంచెను కూలదోయడానికి అది అనసరించిన విధానం ప్రతి ఒక్కరినీ అబ్బురపరుస్తుంది. ఫెన్సింగ్ బలంగా ఎక్కడుందో చూస్తుంది. బలహీనంగా ఎక్కడ ఉందో కూడా చెక్ చేసుకుంటుంది. అనంతరం ఫెన్సింగ్ వీక్‌గా ఉన్న ప్రదేశంలో కాలుతో కూలదోసి దర్జాగా వెళ్లిపోతుంది. 

ఈ వీడియోను పంచుకున్న ఆనంద్ మహీంద్రా.. ప్రతికూలతను దాటడానికి ముందు అది ఏ స్థాయిలో బలాన్ని కలిగి ఉందో ఏనుగులాగే చెక్ చేసుకోవాలి. అనంతరం బలాన్ని, బలహీనతల్ని గుర్తించాలి. సరైన బలంతో తక్కువ ప్రతికూలత ఉన్న ప్రదేశం నుంచి పనిచేయడం ప్రారంభించాలి. అనంతరం ధైర్యంగా నడుచుకుంటూ వెళ్లాలి అని రాసుకొచ్చారు. ఈ వీడియోపై నెటిజన్లు విపరీతంగా కామెంట్లు పెట్టారు. కేవలం నాలుగు గంటల్లోనే లక్షా ఇరవై నాలుగు వేల మంది వ్యూస్ వచ్చాయి.  

ఇదీ చదవండి: Viral Video: ఇదేం విచిత్రం! ఆవు, పాము రెండు అలా..


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement