పూజా ఖేద్కర్‌ తర్వాత మరో ఐఏఎస్‌.. వివాదాల్లో బ్యూరోక్రాట్లు! | After Puja Khedkar, Ex-IAS Officer Abhishek Singh Under Fire Over Disability Claim | Sakshi
Sakshi News home page

పూజా ఖేద్కర్‌ తర్వాత మరో ఐఏఎస్‌.. వివాదాల్లో బ్యూరోక్రాట్లు!

Published Mon, Jul 15 2024 12:21 PM | Last Updated on Mon, Jul 15 2024 3:29 PM

After Puja Khedkar, Ex-IAS Officer Abhishek Singh Under Fire Over Disability Claim

దేశంలో బ్యూరోక్రాట్స్‌ నియామకంపై వరుస వివాదాలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే మహారాష్ట్రలో ట్రైనీ ఐఏఎస్‌ అధికారిణి పూజా ఖేద్కర్‌ నియామకంపై వివాదం నెలకొంది. ఐఏఎస్‌ గట్టెక్కేందుకు ఆమె పలు నకిలీ పత్రాలు సమర్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై దృష్టిసారించిన ప్రధాని మోదీ కార్యాలయం అధికారులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు.

ఈ తరుణంలో తాజాగా మరో మాజీ ఐఏఎస్ అభిషేక్‌ సింగ్‌ సైతం నకిలీ వైకల్య ధృవీకరణ పత్రాలతో యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణత  సాధించినట్లు తెలుస్తోంది.  

అభిషేక్‌ సింగ్‌ 2011 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి. యాక్టింగ్‌పై మక్కువతో గతేడాది ఉద్యోగానికి రాజీనామా చేశారు. అయితే ఐఏఎస్‌ అధికారిగా ఉండగానే అతడు వ్యాయామం చేస్తున్న వీడియోలు కొన్ని వెలుగులోకి రావడంతో వివాదం మొదలైంది. కదలికలకు సంబంధించి శారీరక వైకల్యం (లోకో మోటర్‌ డిసెబిలిటీ) ఉన్నట్లు సర్టిఫికెట్లు సమర్పించడం... ఆ సర్టిఫికెట్ల ఆధారంగానే అతడికి దివ్యాంగుల కోటా కింద యూపీఎస్సీ నియామకం జరగడం గమనార్హం. పీడబ్ల్యూబీడీ3 అని పిలిచే ఈ కేటగిరి కింద ఆసిడ్‌ దాడి బాధితులు మొదలుకొని కండరాల కదలికల్లేని సెర్రబెల్‌ పాల్సీ వ్యాధిగ్రస్తులు, కుష్టు వ్యాధి నుంచి బయటపడ్డవారు. మరుగుజ్జులుగా మిగిలిపోయిన వారు వస్తారు. ఈ కోటా కింద ఐఏఎస్‌ అయిన అభిషేక్‌ సింగ్‌ జిమ్‌లో ఎంచక్కా వ్యాయామాలు చేస్తున్న వీడియోలు బయటపడటంతో యూపీఎస్సీ నియామకాలపై సర్వత్రా ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.  పీడబ్ల్యూబీడీ3 కోటా కిందే ఐఏఎస్‌లో 94వ ర్యాంక్‌ను సాధించడంతో చర్చాంశనీయమైంది.

రిజర్వేషన్లకు సపోర్ట్‌ చేశాననే
తాను ఐఏఎస్‌ సాధించడంపై వస్తున్న ఆరోపణలపై అభిషేక్‌ సింగ్‌ స్పందించారు. రిజర్వేషన్లకు మద్దతు ఇచ్చినందుకు తనను టార్గెట్ చేస్తున్నారని అన్నారు.

కష్టపడి ఐఏఎస్‌ సాధించా
‘ఇప్పటి వరకు నేను ఎలాంటి విమర్శలు రాలేదు. అయినప్పటికీ నా మద్దతు దారులు అడిగినందుకే ప్రస్తుతం నేను ఐఏఎస్‌ ఎలా అయ్యారనే ప్రశ్నకు బదులిస్తున్నాను. నేను రిజర్వేషన్‌లకు సపోర్ట్‌ చేయడం ఎప్పుడైతే ప్రారంభించానో అప్పటి నుంచి రిజర్వేషన్లు వ్యతిరేకించేవారు నన్ను లక్ష్యంగా చేసుకుని విమర్శిస్తున్నారు. నేను ఎంతో కష్టపడి, ధైర్యంతో ఉన్నత స్థాయికి చేరుకుంటున్నాను.రిజర్వేషన్ ద్వారా కాదు’అని ఎక్స్‌ వేదికపై ట్వీట్‌ చేశారు.  

 

టాలెంట్‌ ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలతో పనిలేదు
‘ప్రభుత్వ సహాయం లేకుండా యునైటెడ్ బై బ్లడ్, నో షేమ్ మూవ్‌మెంట్ వంటి నా కార్యక్రమాల ద్వారా సామాజిక సేవ చేశాను. ప్రభుత్వ ఉద్యోగాల్లో జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఉండాలని నేను నమ్ముతున్నాను, ఆ దిశగా కృషి చేస్తాను. మీకు ప్రతిభ ఉందని భావిస్తే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించడం మానేయండి. వ్యాపారం, క్రీడలు లేదా నటనలో రాణించండి’ అని పిలుపునిచ్చారు. 

పూజా ఖేద్కర్‌ ఐఏఎస్‌ పోస్ట్‌కు ఎసరు
ట్రైయినీ ఐఏఎస్‌ అధికారిణి పూజా ఖేద్కర్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. యూపీఎస్సీకి సమర్పించిన అఫిడవిట్‌లో ఖేద్కర్‌ తన చూపు, మానసిక సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. కానీ వాటిని నిర్ధారించడానికి తప్పనిసరి వైద్య పరీక్షలకు హాజరు కావాల్సింది. కానీ ఆమె హాజరు కాలేదు. ఐఏఎస్‌లో ఉత్తర్ణీత సాధించారు. 

కాగా, పూజా ఖేద్కర్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణకు కేంద్రం ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. విచారణలో పూజా దోషిగా తేలితే ఆమెను తొలగించే అవకాశం ఉందని సమాచారం. వాస్తవాలను దాచిపెట్టడం, తప్పుగా సూచించడం వంటి ఆరోపణలు నిజమని తేలితే  క్రిమినల్ చర్యలు కూడా ఎదుర్కోనున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement