‘ఆప్‌ కా రామ్‌రాజ్య్‌’ లాంచ్‌ చేసిన ఆమ్‌ ఆద్మీ! | Aam Aadmi Party Launches AAP Ka RamRajya Website Ahead Of Elections, Details Inside - Sakshi
Sakshi News home page

Delhi: ‘ఆప్‌ కా రామ్‌రాజ్య్‌’ లాంచ్‌ చేసిన ఆమ్‌ ఆద్మీ!

Published Wed, Apr 17 2024 12:15 PM | Last Updated on Wed, Apr 17 2024 12:43 PM

Aap Launches Aapka Ramrajya Website - Sakshi

శ్రీరామ నవమి సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ ‘ఆప్‌ కా రామరాజ్య్‌’ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. దీనికి సంబంధించిన వివరాలను ఆప్ నేత సంజయ్ సింగ్ తెలియజేశారు. జాతిపిత మహాత్మా గాంధీ ప్రస్తావించిన రామరాజ్యంలో అసమానత లేదని, రామరాజ్యం నెలకొల్పాలనే కలను సాకారం చేసేందుకు అరవింద్ కేజ్రీవాల్  ఎంతగానో కృషి చేశారన్నారు. 

అరవింద్ కేజ్రీవాల్ లేకుండా చేసుకుంటున్న తొలి శ్రీరామనవమి ఇదేనని అన్నారు. అయితే కేజ్రీవాల్‌ జైలు నుంచి తమకు సందేశాలు పంపుతూనే ఉన్నారని, అతనిపై నిరాధారమైన కేసులు బనాయించారని సంజయ్‌ సింగ్‌ ఆరోపించారు. అరవింద్ కేజ్రీవాల్‌పై ప్రధానికి ద్వేషం ఉందని, ఎందుకంటే కేజ్రీవాల్‌ చేస్తున్న పనులను ప్రధాని చేయలేరన్నారు. ఈ సందర్భంగా మరోనేత అతిశీ మాట్లాడుతూ రఘుకుల సంప్రదాయం ఎప్పటి నుంచో ఉందని, ప్రాణం పోయినా ఇచ్చిన వాగ్దానాలను ఉల్లంఘించకూడదన్నారు. దీనిని స్ఫూర్తిగా తీసుకుని ఢిల్లీ, పంజాబ్‌ ప్రజలకు అరవింద్‌ కేజ్రీవాల్‌ మేలు చేస్తున్నారన్నారు.

రాముడు అజ్ఞాతవాసానికి వెళ్లవలసి వచ్చినప్పటికీ, తాను ఇచ్చిన మాట తప్పలేదని, అదేవిధంగా ఢిల్లీలో స్కూళ్లు, హెల్త్, విద్యుత్‌ వ్యవస్థ బాగున్నాయా లేదా అని తమకు మెసేజ్ పంపారన్నారు. ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ రామరాజ్యంలో అందరిలో ప్రేమ, సోదరభావం ఉండేదని అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement