శివరాత్రికి ఓటీటీల్లో సినిమాల జాతర.. ఒక్క రోజే 9 చిత్రాలు స్ట్రీమింగ్! This Weekend Ott Released Movies List Goes Viral On | Sakshi
Sakshi News home page

This Weekend Ott Releases Movies: ఈ వీకెండ్‌లో సినిమాల జాతరే.. ఆ రెండు చిత్రాలే స్పెషల్!

Published Thu, Mar 7 2024 9:30 PM | Last Updated on Fri, Mar 8 2024 8:26 AM

This Weekend Ott Released Movies List Goes Viral On  - Sakshi

ఈ సారి ఏకంగా వీకెండ్‌ సెలవులు వచ్చేస్తున్నాయి. అంతే కాకుండా మహాశివరాత్రికి కూడా సెలవు రావడంతో మూడు రోజులు ఇక పండగే. ఈ నేపథ్యంలో వీకెండ్‌ ప్లాన్‌ ఇప్పటికే వేసుకుని ఉంటారు. ఏయే సినిమాలు చూడాలి? ఓటీటీల్లో ఎలాంటి సినిమాలు వస్తున్నాయి? థియేటర్లకు రానున్న చిత్రాలేంటి? అనే తెగ వెతికేస్తుంటారు. మీరు ఆశించినట్టే ఈ సెలవుల్లో ఫుల్ ఎంటర్‌టైన్ చేసేందుకు చిత్రాలు రెడీ అయిపోయాయి. టాలీవుడ్‌లో భీమా, గామి లాంటి పెద్ద చిత్రాలు థియేటర్లలో రిలీజ్ అవుతుండగా.. మరో  రెండు, మూడు చిన్న సినిమాలు కూడా వచ్చేస్తున్నాయి. మలయాళ సూపర్ హిట్ మూవీ ప్రేమలు తెలుగులోనూ రిలీజ్ అవుతోంది.

మరీ ఓటీటీల సంగతేంటీ అనుకుంటున్నారా? థియేటర్ల మాదిరే సినీ ప్రియులను అలరించేందుకు ఓటీటీల్లో సందడి చేసేందుకు స్పెషల్ సినిమాలు వచ్చేస్తున్నాయి. ఈ వారం విజయ్ సేతుపతి మేరీ క్రిస్మస్, మలయాళ హిట్ మూవీ అన్వేషిప్పిన్ కండేతుమ్ కాస్తా ఆసక్తి పెంచుతున్నాయి. కానీ టాలీవుడ్ బ్లాక్‌ బస్టర్‌ హనుమాన్ ఈనెల 8 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని భావించినప్పటికీ.. ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. మరీ సడన్‌గా స్ట్రీమింగ్ చేసి సర్‌ప్రైజ్‌ ఇస్తారేమో వేచి చూడాల్సిందే. లేదంటే నెక్ట్స్‌ వీకెండ్‌ దాకా ఆగాల్సిందే. వీటితో రజినీకాంత్ లాల్ సలామ్, సందీప్ కిషన్ మూవీ ఊరు పేరు భైరవకోన కూడా స్ట్రీమింగ్ అయ్యే అవకాశముంది.


నెట్‌ఫ్లిక్స్‌

మేరీ క్రిస్మస్(హిందీ సినిమా)- మార్చి 08

లోన్ అవే(వెబ్ సిరీస్)- సీజన్ 4- మార్చి 08

డామ్‌ సెల్‌ (యాక్షన్‌ థ్రిల్లర్)- మార్చి 08

అన్వేషిప్పిన్ కండేతుమ్(మలయాళ డబ్బింగ్ మూవీ)- మార్చి 08

లాల్ సలామ్(తమిళ సినిమా)- మార్చి 08

ది క్వీన్ ఆఫ్ టియర్స్(కొరియన్ సిరీస్)- మార్చి 09

 డిస్నీ ప్లస్ హాట్ స్టార్

ట్రూ లవర్(తమిళ సినిమా)- మార్చి 08

షోటైమ్ (హిందీ సినిమా)- మార్చి 08

అమెజాన్‌ ప్రైమ్‌

ఊరుపేరు భైరవకోన(తెలుగు సినిమా)- మార్చి 08
జీ5

హనుమాన్(తెలుగు సినిమా)- మార్చి 08 (రూమర్ డేట్)


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement