బాహుబలి పోస్టర్‌ను రీక్రియేట్‌ చేసిన స్టార్‌.. | Vignesh Shivan Shares Father's Day Post | Sakshi
Sakshi News home page

బాహుబలి రేంజులో పోజు.. ఈ బుడ్డోడిని ఇలా పైకెత్తిన స్టార్‌ ఎవరో తెలుసా?

Published Mon, Jun 17 2024 10:14 AM

Vignesh Shivan Shares Father's Day Post

ఫాదర్స్‌ డే (జూన్‌ 16) రోజు అందరూ తమ తండ్రి గొప్పదనాన్ని, మంచితనాన్ని, ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అయితే పై ఫోటోలో కుమారుడిని పైకెత్తి పట్టుకున్న వ్యక్తి మాత్రం.. పిల్లలు వచ్చాకే తన జీవితం సంతృప్తికరంగా మారిందంటున్నాడు. ఇంతకీ ఇలా చిన్నారులను బాహుబలిలా ఎత్తుకుంది ఎవరో కాదు. దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌. 

ఫాదర్స్‌ డేను నయనతార, విఘ్నేష్‌శివన్‌ తమ కవల పిల్లలతో చాలా జాలీగా గడిపారు. ఈ సందర్భంగా నయనతార తన భర్త విఘ్నేష్‌శివన్‌, పిల్లలు ఉయిర్‌, ఉలగంలతో సరదాగా గడిపిన సన్నివేశాలకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. విఘ్నేష్‌ శివన్‌ నీటిలో మునిగి తన పిల్లలను చేతిలో పైకెత్తి పట్టుకున్న ఫోటోలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. తన జీవితంలో సంతోషానికి కారణం ఉయిర్‌, ఉలగం అని, వారిని ఎంతగానో ప్రేమిస్తున్నానని చెప్పారు. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

 

చదవండి: కూతురు ఐశ్వర్య ప్రేమ పెళ్లి.. హీరో అర్జున్ ఇం‍ట్రెస్టింగ్ కామెంట్స్

Advertisement
 
Advertisement
 
Advertisement