మరో ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు లేటెస్ట్ హారర్ మూవీ | Vaishnavi Chaitanya Love Me Movie Releasing In Another OTT, Check Streaming Platform Details | Sakshi
Sakshi News home page

Love Me In AHA OTT: డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ.. ఇప్పుడు రెండు ఓటీటీల్లో

Published Mon, Jun 17 2024 7:34 AM

Vaishnavi Chaitanya Love Me Movie Streaming Another OTT

'బేబి' ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ మూవీ 'లవ్ మీ'. హారర్ స్టోరీతో తీసిన ఈ చిత్రంలో ఆశిష్ హీరోగా నటించాడు. మే చివరి వారంలో థియేటర్లలో రిలీజైంది. కీరవాణి, పీసీ శ్రీరామ్ లాంటి టాప్ టెక్నీషియన్స్ పనిచేసినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.  ప్రమోషన్స్ బాగానే చేసినా జనాలు పెద్దగా ఆదరించలేదు. అలా గత శుక్రవారం పెద్దగా హడావుడి లేకుండానే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది.

(ఇదీ చదవండి: Pihu Review: ఓటీటీలోనే బెస్ట్ చైల్డ్ మూవీ.. కానీ చూస్తే భయపడతారు!)

సినిమా ఎలా ఉందనేది పక్కనబెడితే ఆడియెన్స్ ఉన్నంతలో కాస్త ఎంటర్‌టైన్ అవుతున్నారు. దెయ్యాన్ని హీరో వెళ్లి ప్రేమించడం అనే కాన్సెప్ట్ కొత్తగా ఉన్నా దాన్ని డైరెక్టర్ సరిగా డీల్ చేయకపోవడంతో 'లవ్ మీ' మిస్ ఫైర్ అయింది. ఇప్పుడు ఈ మూవీ మరో ఓటీటీలోకి వచ్చేసింది. ఆహా లోనూ స్ట్రీమింగ్ అయిపోతోంది. తాజాగా ఇందుకు సంబంధించిన పోస్టర్‌ని ఆహా టీమ్ రిలీజ్ చేసింది.

'లవ్ మీ' కథ విషయానికొస్తే.. అర్జున్ (ఆశిష్)కి దేవుడు, దెయ్యాలపై అస్సలు నమ్మకముండదు. ఎక్కడైనా దెయ్యాలున్నాయని అంటే అక్కడికెళ్లి సాక్షాలతో సహా అవి లేవని వీడియోలతో నిరూపిస్తుంటాడు. అలా యూట్యూబర్‌గా డబ్బులు సంపాదిస్తుంటాడు. ఓసారి అర్జున్ ఫ్రెండ్ ప్రతాప్ (రవికృష్ణ) గర్ల్ ఫ్రెండ్ ప్రియ (వైష్ణవి చైతన్య) ద్వారా దివ్యవతి అనే దెయ్యం గురించి తెలుస్తుంది. ఎలాగైనా ఆ దెయ్యాన్ని ప్రేమలో పడేయాలని అర్జున్ అక్కడికెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? చివరకేమైంది అనేదే స్టోరీ.

(ఇదీ చదవండి: మరో ఓటీటీలోకి వచ్చేసిన 'యాత్ర 2' సినిమా)

Advertisement
 
Advertisement
 
Advertisement