సమంత - విజయ్‌ల మధ్య లిప్‌లాక్‌ సీన్స్‌ అవసరమా..? | Shiva Nirvana Comments On Vijay Devarakonda And Samantha Lip Lock Scene - Sakshi
Sakshi News home page

Kushi Movie: సమంత - విజయ్‌ల లిప్‌లాక్‌పై డైరెక్టర్‌ కామెంట్‌.. ఆ ముచ్చటైనా లేకుంటే ఎలా అంటూ..

Published Sat, Sep 2 2023 8:10 AM | Last Updated on Sat, Sep 2 2023 8:37 AM

Shiva Nirvana Comments On Vijay Devarakonda And Samantha LipLock - Sakshi

విజయ్‌ దేవరకొండ , సమంత  జంటగా నటించిన ఫీల్‌గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘ఖుషి’. శివ నిర్వాణ  దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత జోడీ సినిమాకు మంచి ప్లస్‌ అవడమే కాకుండా ఇందులోని పాట‌లు బాగా కనెక్ట్‌ అయ్యాయి అని చెప్పవచ్చు.  కానీ ఇందులో క్లైమాక్స్‌ సీన్‌ మాత్రమే బాగుంది అంటూ కొందరు పెదవి కూడా విరుస్తున్నారు.

(ఇదీ చదవండి: ప్రముఖ నటి అపర్ణ మృతికి భర్తే కారణం.. ఏం జరిగిందంటే)

‘ఖుషి’ సినిమా చూసినవారికి ఊహించని సీన్ ఒకటి పాటలో ఎదురైంది. అదే విజయ్ దేవరకొండ -సమంత మధ్య లిప్ లాక్ సీన్. ఇప్పుడంతా దీని గురించే చర్చ. సమంత సీనియర్‌ నటి కదా ఇందులో ఏమంత రొమాంటిక్‌ సీన్స్‌ ఉండవులే అని వెళ్లిన వారు దీంతో షాక్‌ అయ్యారు. ఇక్కడ లిప్‌లాక్‌ సీన్‌ అవసరమా అని కొందరు కామెంట్‌ కూడా చేశారు. ఇదే ప్రశ్న దర్శకుడు శివ నిర్వాణకు ప్రెస్‌మీట్‌లో ఎదురైంది. అందుకు దర్శకుడు కూడా హుందాగా ఇలా సమాధానం ఇచ్చారు. అక్కడ తాను హీరోయిన్‌ సమంతను చూడలేదని.. ఖుషి సినిమాలో ఆరాధ్యను మాత్రమే చూశానని శివ నిర్వాణ అన్నారు.

సినిమాలో రెండు పాత్రల మధ్య జరిగే సంఘర్షణలో ప్రేమ, ఎమోషన్‌ను చెప్పడానికి లిప్ లాక్ సీన్ అవసరమేనని ఆయన చెప్పుకొచ్చారు. సినిమా కథలో రెండు పాత్రలు ఒక ఏడాది పాటు కలిసి ప్రయాణం చేసి ఆపై పెళ్లి అవడం జరుగుతుంది. ఇందులో పిల్లల కోసం అని ఒక ఎమోషన్ పెట్టాం. అలాంటప్పుడు ముద్దు అనే ఒక చిన్న ముచ్చట కూడా లేకపోతే అసలు అర్థంపర్థం ఉంటుందా అని ఆయన చెప్పుకొచ్చారు. సినిమా చూస్తున్నంత సేపు కొంచెం నేచురల్‌గా చూపించాలి కదా. చూసే ప్రేక్షకులు కూడా నమ్మాలికదా. వారిద్దరూ నిజంగానే భార్యాభర్తలుగా ఉన్నారనే ఫీలింగ్ రావాలి కదా. అందుకే ఆ సీన్‌ పెట్టామని శివ నిర్వాణ తెలిపారు. 

(ఇదీ చదవండి: Kushi Movie Review: ‘ఖుషి’మూవీ రివ్యూ)

విజయ్, సమంతతో ఆ ముద్దు సీన్స్‌ ఎలా చేయించారని మరో మహిళా జర్నలిస్ట్ అడగగా.. 'ఇందులో ఇబ్బంది ఏముంది..?  యాక్షన్ అంటే చేసేశారు.. కట్ అంటే అయిపోయింది.' అని నవ్వుతూ ఆయన సమాధానం ఇచ్చారు. సినిమాల్లో రొమాంటిక్ సన్నివేశాల్లో కూడా పనిలో భాగమేనని డైరెక్టర్‌ శివ నిర్వాణ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement