Hero Sanjay Rao Talk About Slum Dog Husband Movie - Sakshi
Sakshi News home page

‘స్లమ్ డాగ్ హజ్బెండ్’లో కుక్కదే కీరోల్‌.. బాగా నవ్వకుంటారు: సంజయ్ రావు

Published Tue, Jul 25 2023 5:01 PM | Last Updated on Tue, Jul 25 2023 5:26 PM

Sanjay Rao Talk About Slum Dog Husband Movie - Sakshi

మా నాన్న(బ్రహ్మాజీ)ను ఇండస్ట్రీలోకి వచ్చాను. ఆ తర్వాత బన్నీ(అల్లు అర్జున్‌)ని ఆదర్శంగా తీసుకున్నాను. ఆయన జర్నీ నాకు తెలుసు. ఓ పెద్ద నిర్మాత కొడుకు ఈజీగా సినిమాల్లోకి వచ్చాడు అని అందరూ అనుకుంటారు. కానీ లోపల వేరు. సినిమాల కోసం బన్నీ ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఆయన పడే కష్టం మా నాన్న నాకు రోజు చెబుతూ ఉంటారు. నేను కూడా బన్నీలాగే కష్టపడి ఇండస్ట్రీలో నాకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నాను’అని యంగ్‌ హీరో సంజయ్ రావు అన్నారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’. ప్రణవి మానుకొండ  హీరోయిన్‌. ఈ చిత్రానికి డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ శిష్యుడు డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించాడు. జులై 29న ఈ చిత్రం విడుదల కాబోతుంది.ఈ సందర్భంగా హీరో సంజయ్‌ రావు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. 

ఈ కథ మా నాన్న ద్వారా నా దగ్గరకు వచ్చింది. డైరెక్టర్ గారు నాకు స్టోరీ చెబుతూనే ఆయన తెగ నవ్వుకున్నారు. నాకు కాన్సెప్ట్ బాగా నచ్చింది. వెంటనే ఒకే చేశా. 

రెగ్యూలర్ సినిమాల్లో హీరోయిన్ అంటే గ్లామర్.. హీరోయిన్ పెట్టాలని పెడతారు. కానీ ఈ సినిమాలో ప్రణవి రోల్ ఫుల్ లెంగ్త్‌లో ఉంటుంది. చాలా ముఖ్యమైన పాత్ర ఆమెది. ఈ సినిమాలో చాలా మంది డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉంటాయని అనుకుంటున్నారు. అలాంటివేమి ఉండవు. జనరల్‌గా రాత్రి పూట బాయ్‌ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ మాట్లాడుకునేదే ఉంటుంది. అదే రియాలిటీ ఉంటుంది. ఈ రియాలిటీకి యంగ్ జనరేషన్ కనెక్ట్ అవుతోంది. 

ఈ సినిమాలో బేబీ (కుక్క)దే కీరోల్. అదే సినిమాను మొత్తం డిసైడ్ చేస్తుంది.నేను డాగ్ లవర్ కావడంతో షూటింగ్‌లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎంజాయ్ చేశా.

సెట్స్‌లో మా నాన్నను ఓ నటుడిగానే చూస్తా. కో యాక్టర్‌గానే కలిసి నటిస్తా. పుష్ప షూటింగ్‌లో అల్లు అర్జున్ గారు నాన్నతో మాట్లాడారు. 'బ్రహ్మాజీ మీ కొడుకు సినిమా ట్రైలర్ అదిరిపోయింది. సినిమా ఎలా ఉంటుందో తెలియదు. ట్రైలర్ మాత్రం చాలా బాగుంది..' అని బన్నీ గారు అన్నారు. కారు ఎక్కే ముందు ఫయాద్ ఫజిల్‌ గారికి ఈ ట్రైలర్‌ను కచ్చితంగా చూడాలని చెప్పారు. 

నాకు పెద్దగా ఎవరితో పరిచయాలు లేవు. నేను ఎవరి అయినా కలవాలంటే వాళ్ల ఇంటి బయట నిల్చుంటా. భీమ్లా నాయక్ సినిమా సమయంలో త్రివిక్రమ్‌ను కలిసేందుకు ఐదు రోజులు అక్కడ జనాల మధ్య లైన్‌లో నిలబడ్డా. ఒక బౌన్సర్ నన్ను చూసి ఏంటి సార్ అక్కడ నిల్చున్నారని అన్నాడు. తరువాత రెండు నిమిషాలు త్రివిక్రమ్ గారితో మాట్లాడా. 

నేను నావీ నుంచి కొన్ని కారణాల వల్ల బయటకు వచ్చా. ఆ తరువాత యాక్టింగ్‌లో శిక్షణ కోసం ముంబై వెళ్లా. ఆళ్ల పురుషోత్తం గారి దగ్గరకు వెళ్లా. లావణ్య త్రిపాఠి గారు అక్కడే శిక్షణ తీసుకున్నారు. ఆమె మా నాన్నతో చెప్పి అక్కడికి రికమెండ్ చేశారు. అక్కడ వెళితే.. స్టూడెంట్స్ అంతా నార్త్ వాళ్లే ఉన్నారు. నాది హైదరాబాద్ అని చెబితే.. హైదరాబాదా..? సౌత్ ఇండియానా..? అని ఒక రకంగా చూశారు. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీ ముందుకు వెళుతోంది. ఇప్పుడు ముంబైలో అడుగుపెడితే మనకు ఇచ్చే గౌరవమే వేరు.

హీరోగా రెండు సినిమాలు ఉన్నాయి. అవి హోల్డ్‌లో పెట్టా. ఒక సినిమా షూట్ స్టార్ట్ అయింది. ఓ పిట్టకథ చిత్రం కో డైరెక్టర్‌గా పనిచేసిన సాయికృష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్నా. నాకు వెబ్‌సిరీస్ అని.. సినిమా అని వేరే క్యాటగిరీలు ఉండవు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement