అలాంటి సర్జరీ చేయించుకోమని సలహా ఇచ్చారు: టాలీవుడ్ హీరోయిన్ | Sameera Reddy Reveals She Was Pressured To Get A Boob Job For Her Career, Deets Inside | Sakshi
Sakshi News home page

Sameera Reddy: సర్జరీ చేయించుకోమని నాపై ఒత్తిడి తెచ్చారు: సమీరా రెడ్డి

Published Sun, Jun 9 2024 4:24 PM | Last Updated on Sun, Jun 9 2024 6:28 PM

Sameera Reddy reveals she was pressured to get a boob job her career


హీరోయిన్‌ సమీరా రెడ్డి పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న ఆమె సినిమాలకు సినిమాలకు గుడ్‌బై చెప్పి వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. అశోక్‌, జై చిరంజీవ లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచమైన ఈ భామ.. 2014లో అక్షయ్‌ని వివాహం చేసిన ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పింది. అయితే ప్రస్తుతం సమీరా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఎప్పటికప్పుడు టచ్‌లోనే ఉంటోంది. అయితే నటిగా ఉన్నప్పుడు తన శరీరంలో చాలా మార్పులు వచ్చాయని తెలిపింది. కొందరు ఏకంగా సర్జరీ చేయించుకోవాలని సలహాలిచ్చాలంటూ వెల్లడించింది. ఆ సమయంలో తాను చాలా ఒత్తిడికి గురైనట్లు పేర్కొంది.

సమీరా మాట్లాడుతూ..'నా కెరీర్‌లో అగ్రస్థానంలో ఉన్న రోజుల్లో నాపై ఒత్తిడి చాలా ఉండేది. చాలామంది బూబ్ జాబ్ సర్జరీ(బ్రెస్ట్ ఇంప్లాంటేషన్) చేయించుకోమని సలహా ఇచ్చారు. అందరు చేయించుకుంటున్నారు కదా.. మీకేమైందంటూ అడిగేవారు. సర్జరీ చేసుకోమని నాపై ఒత్తిడి తెచ్చారు. కానీ నాకు అది ఇష్టం లేదు. మన జీవితం ఎలా ఉంటుందో తెలియదు. నేను ప్లాస్టిక్ సర్జరీ, బొటాక్స్ చేయించుకునే వారిని తప్పుపట్టను. ఎందుకంటే నా విషయంలో సమస్యను నేను అంతర్గతంగానే పరిష్కరించుకోగలను' అని చెప్పింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement