Pushpa Full Movie Leaked: Pushpa Movie Gets Pierced Full Movie HD Leaked On Online - Sakshi
Sakshi News home page

Pushpa Movie: ‘పుష్ప’ టీమ్‌కి భారీ షాక్‌, ఆందోళనలో దర్శక-నిర్మాతలు

Published Sat, Dec 18 2021 11:19 AM | Last Updated on Mon, Dec 20 2021 11:28 AM

Pushpa Movie Gets Pierced Full Movie HD Leaked On Online - Sakshi

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌-సుకుమార్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘పుష్ప’ మూవీ శుక్రవారం(డిసెంబర్‌ 17) విడుదలైన సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాల మధ్య భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ మూవీకి భారీ షాక్‌ తగిలింది. విడుదలైన కొద్ది గంటల్లోపై పుష్ప పైరసీ అయినట్లు తెలుస్తొంది. కాగా చిన్న సినిమాల నుంచి భారీ బడ్జెట్‌ చిత్రాలకు ఈ పైరసి బెడద తప్పడంలేదు.

చదవండి: సమంత స్పెషల్‌ సాంగ్‌పై పేరడీ, అమ్మాయిలకు కౌంటర్‌గా లిరిక్స్‌..

ఇప్పటికే ఎన్నో సినిమాలతో పాటు చివరికి బాహుబలి వంటి పాన్‌ ఇండియా చిత్రం కూడా ఈ పైరసీ బారిన పడింది. తాజాగా పుష్ప మూవీపై కూడా ఈ లీక్‌ వీరులు కన్నేశారు. విడుదలైన కొద్ది గంటల్లోనే పుష్ప ఫుల్‌ మూవీ లింక్‌ను ఆన్‌లైన్‌లో పెట్టేశారు. చాలా కాలంగా పైరసీని ప్రోత్సహిస్తోన్న తమిళ్ రాకర్స్, మూవీ రూల్జ్ వంటి సంస్థలు ఎన్నో చిత్రాలను ఆన్‌లైన్‌లో పెట్టేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ‘పుష్ప' మూవీని కూడా లీక్ చేసేశాయి.

చదవండి: ‘పుష్ప’ థియేటర్‌ ఎదుట ఫ్యాన్స్‌ ఆందోళన, రాళ్లతో దాడి

దీంతో కలెక్షన్స్‌ పరంగా రికార్డు సృష్టిస్తుందని చిత్ర యూనిటితో పాటు నిర్మాతలు పెట్టుకున్న ఆశలకు గండి పడినట్టైంది. దీంతో మూవీ యూనిట్‌ ఆందోళనలో పడింది. ఇప్పటికే పుష్ప మూవీ ప్రేక్షకుల అంచనాలను చేరుకొలేకపోయిందనే టాక్‌ నడుస్తోంది. బ్లాక్‌బస్టర్‌ చిత్రం అనుకున్న ఈ మూవీపై కొందరూ యావరేజ్‌అనే ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో మూవీ ఆన్‌లైన్‌లో లీక్‌ అవ్వడం పుష్ప మూవీకి కలెక్షన్స్‌ పరంగా దెబ్బ పడినట్టే అని చెప్పుకోవాలి. మరి దీనిపై మూవీ టీం ఎలా స్పందిస్తుందో చూడాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement