నాని 'గ్యాంగ్‌ లీడర్‌' హీరోయిన్‌ అలాంటి సినిమా చేసిందా..? | Actress Priyanka Arul Mohan Throwback Movie Tik Tok Trending On Social Media Now, Deets Inside - Sakshi
Sakshi News home page

నాని 'గ్యాంగ్‌ లీడర్‌' హీరోయిన్‌ అలాంటి సినిమా చేసిందా.. 20 నిమిషాల సీన్స్‌ కట్‌

Published Sat, Feb 24 2024 2:22 PM | Last Updated on Sat, Feb 24 2024 3:25 PM

Priyanka Arul Mohan Throwback Movie viral Now - Sakshi

కథానాయికలు ఒక స్థాయికి చేరే వరకు పీత కష్టాలు పీతవి అన్నట్లు వారి కష్టాలు వారికి ఉంటాయి. ఆ తర్వాత వారేంటో చూపిస్తారు. నటి  ప్రియాంకా అరుళ్‌ మోహనన్‌ కూడా ఇందుకు అతీతం కాదన్నది ఇటీవలే తెలిసింది. ఈ కన్నడ బ్యూటీ చదివింది ఇంజినీరింగ్‌. అయితే ఎంచుకున్న వృత్తి మాత్రం నటన. మొదట్లో మోడలింగ్‌ చేసిన ఆ తర్వాత మాతృభాషలో కథానాయకిగా సినీ రంగప్రవేశం చేశారు. కన్నడ చిత్రంలో నటించిన వెంటనే తెలుగు చిత్రంలో లభించే అవకాశం వరించింది అలా విక్రమ్‌కుమార్‌ నానీకి జంటగా గ్యాంగ్‌ లీడర్‌ చిత్రంలో నటించారు.

ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా ప్రియాంక తన నటనతో అందరి దృష్టిలో పడ్డారు. అలాంటి సమయంలో డాక్టర్‌ చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. శివకార్తికేయన్‌ కథానాయకుడిగా నెల్సన్‌ దర్శకత్వం వహించిన ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత అదే హీరోతో జతకట్టి డాన్‌ చిత్రం సూపర్‌ హిట్‌ అయ్యింది. దీంతో ప్రియాంకమోహన్‌కు స్టార్‌ ఇమేజ్‌ వచ్చిందనే చెప్పాలి. వరుసగా సూర్య సరసన ఎదర్కుమ్‌ తుణిందవన్‌ (ET), ధనుష్‌తో కెప్టెన్‌ మిల్లర్‌ నటించి పేరు తెచ్చుకున్నారు.

ఈ సినిమాలో శృంగారభరితంగా నటించారా..?
ఈ బ్యూటీకి అందాలారబోతలకే దూరం అనే పేరు ఉంది. తాజాగా తెలుగులోనూ నానితో సరిపోదా శనివారం  చిత్రం చేస్తుంది.  ప్రియాంక తమిళంలో నటించిన తొలి చిత్రం డాక్టర్‌ అనేది ప్రచారంలో ఉంది. అయితే అంతకుముందే ఆమె 'టిక్‌ టాక్‌' అనే చిత్రంలో నటించారు. కానీ ఈ చిత్ర ట్రైలర్‌ ఇటీవల విడుదలైంది. అందులో ప్రియాంకమోహన్‌ బెడ్‌ రూమ్‌ సన్నివేశాలు చూసి అభిమానులు షాక్‌ అయ్యారు. కారణం అందులో ఈ అమ్మడు శృంగారభరితంగా నటించడమే. దీంతో కెరీర్‌ ఆరంభంలో ఇదంతా సహజమే అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె నటనకు ఎక్కువ ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో కనిపిస్తున్నారు. 

సీన్స్‌ కట్‌.. పోలీసులకు నిర్మాత ఫిర్యాదు
'టిక్ టాక్' సినిమా నుంచి ప్రియాంక మోహన్ సీన్స్‌ తొలగించడంతో నిర్మాత పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ప్రియాంక మోహన్ 2017లో 'టిక్ టాక్' అనే తమిళ సినిమాకు సంతకం చేసినట్లు చెబుతున్నారు. నటి ప్రియాంక మోహన్‌తో మూడున్నర కోట్ల రూపాయలతో ‘టిక్‌టాక్‌’ సినిమా తీశానని, ఆ తర్వాతే ఆమె ఇతర సినిమాల్లో నటించి ఫేమస్ అయ్యిందని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు.


అయితే డిసెంబర్ 2023లో డిఎస్ఆర్ ఫిల్మ్స్ ద్వారా విడుదలైన ఈ చిత్రాన్ని చూసి నిర్మాత షాక్ అయ్యాడు. సినిమాలోని ప్రియాంక మోహన్‌కి సంబంధించిన ముఖ్యమైన 20 నిమిషాల సన్నివేశాలను నిర్మాతకు తెలియకుండా ఉద్దేశపూర్వకంగా తొలగించారు, దీంతో సినిమా ప్రేక్షకులకు కనెక్ట్‌ కాలేదు. దాంతో నిర్మాతకు మూడున్నర కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని, సినిమా పరాజయానికి DSR ఫిలింస్ కారణమని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో నిర్మాతకు నష్టం కలిగించిన డీఎస్‌ఆర్‌ ఫిల్మ్‌, మాస్టరింగ్‌ ఇంజనీర్‌ దినేష్‌పై చర్యలు తీసుకోవాలని గతంలో పోలీసులను నిర్మాత కోరారు. ఇదంతా ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement