Markandey Katju, Taran Adarsh Tweets on Pathaan Movie - Sakshi
Sakshi News home page

‘పఠాన్‌’ సినిమాకు స్పందన.. మూర్ఖుల సంఖ్య పెరిగింది!

Published Fri, Jan 27 2023 3:40 PM | Last Updated on Fri, Jan 27 2023 4:14 PM

Markandey Katju, Taran adarsh Tweets on Pathaan Movie - Sakshi

ముంబై: బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారూఖ్‌ ఖాన్‌ నటించిన ‘పఠాన్‌’ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తోంది. నాలుగేళ్ల విరామం తర్వాత ‘పఠాన్‌’గా తెరపైకి దూసుకొచ్చిన షారూఖ్‌ సత్తా చాటాడు. వివాదాల నడుమ విడుదలైన ఈ సినిమా భారీ కలెక్షన్లతో బాక్సాఫీస్‌ రికార్డులను తిరగరాస్తోంది. అయితే ఈ సినిమాపై వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తమ అభిప్రాయాలను ట్విటర్‌ వేదికగా వెల్లడిస్తున్నారు. 

ఏముందని చూస్తున్నారు?
‘పఠాన్‌’ సినిమా విజయంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ ఖట్జూ తనదైన శైలిలో స్పందించారు. ‘పఠాన్‌ సినిమాకు వస్తున్న స్పందన చూసిన తర్వాత, ఇండియాలోని మూర్ఖుల సంఖ్య మీద నా అంచనా 90 శాతం నుంచి 95 శాతానికి పెరిగింద’ని ట్వీట్‌ చేశారు. నల్లమందు ధర పెరిగింది కాబట్టి.. చౌకైన ప్రత్యామ్నాయంగా ‘పఠాన్‌’ను కనుగొన్నారని సెటైర్‌ వేశారు. 

అన్నీ ఉన్నాయి
2023లో ఇదే మొదటి బ్లాక్‌ బస్టర్‌ అంటూ సినీ విమర్శకుడు తరణ్‌ ఆదర్శ్ పేర్కొన్నారు. ‘పఠాన్‌’లో అన్నీ ఉన్నాయి. స్టార్‌ పవర్, స్టైల్, హంగు, ఆత్మ, విషయం, ఆశ్చర్యాలు, ఇంకా అన్నింటికంటే ముఖ్యంగా ప్రతీకారేచ్ఛతో వచ్చిన షారుక్‌ ఖాన్‌. 2023లో ఇదే మొదటి బ్లాక్‌ బస్టర్‌!’అని ట్వీట్‌ చేశారు. అంతేకాదు ట్విటర్‌లో ‘పఠాన్‌’సినిమాకు నాలుగున్న స్టార్స్‌ రేటింగ్‌ కూడా ఇచ్చారు. 

కాగా, పఠాన్‌ సినిమా రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 170 కోట్ల రూపాయల గ్రాస్‌ వసూళ్లు రాబట్టినట్టు ట్రేడ్‌ వర్గాల సమాచారం. మున్ముందు కలెక్షన్లు మరింత పెరిగే అవకాశముందని అంచనా. (క్లిక్ చేయండి: షారుక్‌ పని అయిపోయిందంటూ ట్వీట్‌.. చివర్లో ట్విస్ట్‌!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement