Nithiin Macherla Niyojakavargam Movie Twitter Review In Telugu - Sakshi
Sakshi News home page

Macherla Niyojakavargam Twitter Review : ‘మాచర్ల నియోజకవర్గం’ టాక్‌ ఎలా ఉందంటే

Published Fri, Aug 12 2022 6:32 AM | Last Updated on Fri, Aug 12 2022 9:38 AM

Macherla Niyojakavargam Movie Twitter Review In Telugu - Sakshi

యంగ్  హీరో నితిన్ తాజాగా నటించిన చిత్రం మాస్, కమర్షియల్ ఎంటర్ టైనర్ చిత్రం'మాచర్ల నియోజకవర్గం. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని భారీ ఖర్చుతో నిర్మించారు. చిత్రానికి ఎమ్.ఎస్.రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించారు. కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి స్పెషల్ సాంగ్‌లో నటించింది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచాయి. దానికి తోడు ప్రమోషన్స్‌ కూడా గ్రాండ్‌గా నిర్వహించడంతో ‘మాచర్ల నియోజకవర్గం’పై బజ్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య నేడు (ఆగస్ట్‌ 12)ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్‌ షో పడిపోయింది. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘మాచర్ల నియోజకవర్గం’ కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలను ట్విటర్‌ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. అయితే, ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. అందులో వారు పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు.

► సినిమా వేరే లెవల్‌లో ఉందని.. మాస్‌ ఎంటర్‌టైనర్‌ అని ఓ అభిమాని ట్విటర్‌లో కామెంట్‌ చేశాడు.

► వెన్నెల కిశోర్‌ కామెడీ బాగుంది. ఇంటర్వెల్‌ సీన్‌, సెకండాఫ్‌ సినిమాకు చాలా కీలకమని ఓ అభిమాని పేర్కొన్నాడు.

► సినిమాలో కొత్తదనం లేదని, రొటీన్‌ స్క్రిప్ట్‌ అని ఓ నెటిజన్‌ పేర్కొన్నాడు. ఫస్టాఫ్‌ మరీ యావరేజ్‌గా ఉందని చెప్పాడు.

► సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అని ఓ అభిమాని హర్షం వ్యక్తం చేశాడు.

► పాటలు, బీజీఎం పెద్దగా ఆకట్టుకోలేదని ఓ నెటిజన్‌ చెప్పుకొచ్చాడు. నితిన్‌ గత సినిమా భీష్మలో 50 శాతం కూడా మాచర్ల నియోజకవర్గం ఆకట్టుకోలేదని అన్నాడు.

► వెన్నెల కిశోర్‌ కామెడీ పండిందని ఓ అభిమాని ట్విటర్‌లో వెల్లడించాడు.

► సినిమా బాగుందని ఓ నెటిజన్‌ హార్ట్‌ ఎమోజీ ట్వీట్‌ చేశాడు.

► వెన్నెల కిశోర్‌ కామెడీ బాగుందని, ఫస్టాఫ్‌ యావరేజ్‌ అని ఓ అభిమాని ట్విటర్‌లో వెల్లడించాడు. సినిమాకు కీలకమైన ‘అసలు కథ’ ఇప్పుడే మొదలైందని చెప్పుకొచ్చాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement