హీరో దర్శన్ అరెస్ట్.. సంబంధం లేదని తేల్చేసిన మరో కన్నడ హీరో | Kiccha Sudeep Comments On Actor Darshan's Arrest | Sakshi
Sakshi News home page

Darshan Arrest Sudeep: దర్శన్ అరెస్ట్.. ఇండస్ట్రీకి సంబంధం లేదు

Published Mon, Jun 17 2024 10:21 AM

Kiccha Sudeep Comments On Actor Darshan's Arrest

హత్య కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్ అరెస్ట్ కావడం ఈ మధ్య కలకలం రేపింది. స్వయంగా అభిమానిని చంపాడనే ఆరోపణలతో ఇతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు ఇంకా కోర్టులోనే ఉంది. అలానే బయటకొస్తున్న ఒక్కో విషయం అందరికీ వరస షాకులు ఇస్తోంది. అయితే దర్శన్ అరెస్ట్ వల్ల కన్నడ ఇండస్ట్రీకి బ్యాడ్ నేమ్ వచ్చేలా ఉంది. దీంతో అప్రమత్తమైన ప్రముఖ కన్నడ హీరో సుదీప్.. దీంతో ఇండస్ట్రీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చాడు. మరికొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

'మీడియాలో ఏం చూపిస్తున్నారో మాకు కూడా అంతే తెలుసు. ఎందుకంటే మేం నేరుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి అడగలేం కదా! నిజాన్ని బయటపెట్టేందుకు పోలీసులు, మీడియా చాలానే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో సందేహం లేదు. హత్యకు గురైన రేణుకా స్వామి కుటుంబానికి, అతడికి పుట్టబోయే బిడ్డకు న్యాయం జరగాలి. ఈ కేసులో న్యాయం గెలవాలి'

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్.. ఆ రెండు స్పెషల్!)

'అయితే దర్శన్ అరెస్ట్ అవడంతో నింద అంతా సినిమా ఇండస్ట్రీపై వేస్తున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీకి న్యాయం జరగాలి.. కన్నడ చిత్రపరిశ్రమలో ఎందరో నటులున్నారు. ఇది ఏ ఒక్కరికో ఇద్దరికో సంబంధించనది కాదు. నిందితుడికి శిక్ష పడితే ఫిల్మ్ ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకుంటుంది' అని సుదీప్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

ఈ నెల 8న రేణుకా స్వామి అనే వ్యక్తి అనుమానాస్పద రీతిలో శవమై కనిపించాడు. ఇతడిని ఎవరు చంపారనే కోణంలో ఆరా తీయగా.. హీరో దర్శన్ పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం తనతో రిలేషన్‌లో ఉన్న పవిత్ర గౌడని రేణుకాస్వామి ఇబ్బంది పెట్టడంతోనే దర్శన్ కోపం పెంచుకుని రేణుకా స్వామిని హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసులు దర్శన్ సహా 11 మందిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం దర్యాప్తు సాగుతోంది.

(ఇదీ చదవండి: కూతురు ఐశ్వర్య ప్రేమ పెళ్లి.. హీరో అర్జున్ ఇం‍ట్రెస్టింగ్ కామెంట్స్)

Advertisement
 
Advertisement
 
Advertisement