ఓటీటీలో జిగర్తాండ డబుల్‌ ఎక్స్‌.. అప్పటినుంచే స్ట్రీమింగ్‌ | Jigarthanda Double X Movie OTT Release Date Confirmed, Check Streaming Platform Details - Sakshi
Sakshi News home page

Jigarthanda Double X Movie: నెల రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తున్న హిట్‌ మూవీ.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

Published Fri, Dec 1 2023 11:47 AM | Last Updated on Fri, Dec 1 2023 12:05 PM

Jigarthanda Double X OTT Release Date Confirmed - Sakshi

రాఘవ లారెన్స్‌, ఆర్‌జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం జిగర్‌తాండ డబుల్‌ ఎక్స్‌. తమిళంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన జిగర్‌తాండ (ఈ మూవీ తెలుగులో గద్దలకొండ గణేశ్‌గా రీమేక్‌ అయింది)కు సీక్వెల్‌గా తెరకెక్కింది. నవంబర్‌ 10న తెలుగు, తమిళ భాషల్లో రిలీజైంది చిత్రం. తెలుగువారికి పెద్దగా కనెక్ట్‌ అవలేదు కానీ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్లకు పైగా వసూలు చేసింది.

లారెన్స్‌, సూర్య నటనకైతే నూటికి నూరు మార్కులు పడ్డాయి. తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. డిసెంబర్‌ 8 నుంచి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ఇంగ్లీష్‌లో కూడా త్వరలోనే విడుదల చేస్తామని వెల్లడించింది నెట్‌ఫ్లిక్స్‌. ఇది చూసిన అభిమానులు వెయిటింగ్‌ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

కథేంటంటే.. 
కృపాకర్‌ (ఎస్‌జే సూర్య) కష్టపడి పోలీసు ఉద్యోగం సంపాదించుకుంటాడు. అంతలోనే చేయని తప్పుకు ఓ హత్య కేసులో జైలుపాలవుతాడు. కర్నూల్‌లోని జిగర్‌ తాండ మర్డర్‌ క్లబ్‌ గ్యాంగ్‌స్టర్‌ సీజర్‌ (రాఘవ లారెన్స్‌)ను చంపితే  కేసు నుంచి బయటపడటమే కాకుండా తిరిగి ఎస్సై ఉద్యోగం పొందగలుగుతాడు. అందుకని సీజర్‌ను చంపే ఆపరేషన్‌ను పూర్తి చేసేందుకు ఒప్పుకుంటాడు. సీజర్‌కు హీరో అవ్వాలన్న పిచ్చి ఉందని తెలిసి దర్శకుడిగా అతడి దగ్గర చేరతాడు. మరి కృపాకర్‌ అనుకున్నది జరిగిందా? హీరోగా పేరు తెచ్చుకోవాలన్న సీజర్‌ కల నెరవేరిందా? అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!

చదవండి: ఎవరైనా నా చేయి పట్టుకుంటారా?.. హీరోయిన్‌ పోస్ట్‌ చూశారా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement