Indian Idol Telugu Season 2 Grand Finale Chief Guest Revealed By Aha - Sakshi
Sakshi News home page

Indian Idol Telugu Season 2: ఇండియన్ ఐడల్ గ్రాండ్ ఫినాలే.. ఛీఫ్ గెస్ట్‌గా పాన్‌ ఇండియా స్టార్!

Published Fri, May 19 2023 8:08 PM | Last Updated on Fri, May 19 2023 9:02 PM

Indian Idol Telugu Season 2 Grand Finale Chief Guest Revealed By Aha - Sakshi

ప్ర‌ముఖ తొలి తెలుగు ఓటీటీ సంస్థ ‘ఆహా’ నిర్వ‌హిస్తున్న తెలుగు ఇండియన్‌ ఐడల్‌ సీజన్-2 సంగీత ప్రియులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. మొదటి సీజన్ సక్సెస్ కావడంతో రెండో సీజన్‌ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

(ఇది చదవండి: NTR30: ఎన్టీఆర్30 ఫస్ట్‌లుక్‌ పోస్టర్.. టైటిల్ అదిరిపోయింది!)

అయితే ఈ సీజన్‌ గ్రాండ్ ఫినాలేకు పాన్ ఇండియా స్టార్ హాజరవుతున్నట్లు ట్వీట్ చేసింది. అంతేకాకుండా పుష్ప-2 టీజర్‌తో పాటు గెస్ట్ ఎవరో కూడా హింట్ ఇచ్చింది.  ఈ సారి గ్రాండ్ ఫినాలేకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరవుతున్నట్లు ట్వీట్ ద్వారా స్పష్టం చేసింది. 

కాగా.. తొలి ఇండియన్ ఐడల్ తొలి సీజన్‌లో నెల్లూరుకు చెందిన యువ ప్రతిభావంతులైన గాయని బీవీకే వాగ్దేవి గెలుచుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై ఆమెకు ప్రైజ్ మనీతో పాటు రూ.లక్ష విలువైన ట్రోఫీని అందించాడు. చిరుతో పాటు రానా, సాయిప‌ల్ల‌వి ఈ షోలో సంద‌డి చేశారు.

(ఇది చదవండి: వారికి అచ్చిరానీ టాలీవుడ్.. రామ్‌ చరణ్‌ 'గేమ్‌ ఛేంజర్‌' పరిస్థితి ఏంటీ?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement