Darshini Trailer: భవిష్యత్తులో జరిగేది ముందే తెలిస్తే..? Darshini Movie Trailer Out | Sakshi
Sakshi News home page

Darshini Trailer: భవిష్యత్తులో జరిగేది ముందే తెలిస్తే..?

Published Thu, May 2 2024 4:29 PM | Last Updated on Thu, May 2 2024 4:29 PM

Darshini Movie Trailer Out

వికాస్‌, శాంతి జంటగా నటించిన తాజా చిత్రం దర్శిని.  డాక్టర్ ప్రదీప్ అల్లు దర్శకత్వం వహిస్తున్న ఈ సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌కి డాక్టర్‌ ఎల్‌ వి సూర్యం నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ని కే ఎల్ దామోదర్ ప్రసాద్ విడుదల చేశారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందనే విషయాన్ని ముందే చూడగలిగే టెక్నాలజీ వస్తే ఎలా ఉంటుంది? దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయనే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 
ఈ సందర్భంగా కేఎల్‌ దామోదర్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ.. దర్శిని కాన్సెప్ట్‌ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. తక్కువ బడ్జెట్‌లో చాలా మంచి సినిమా తీశారు. ఈ చిత్రం కచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’ అన్నారు.

‘జీవితం మీద అసంతృప్తిగా ఉన్న ముగ్గురు కి ఎలాంటి పరిస్థితులు వచ్చాయి అనేదే మా చిత్ర కథ. సినిమా చాలా బాగా వచ్చింది. మంచి కామెడీ, ఎమోషన్, లవ్ అని అంశాలు మా చిత్రాల్లో ఉన్నాయి. మే నెలలో విడుదల చేస్తాం’ ని నిర్మాత ఎల్‌ వి సూర్యం అన్నారు. ఈ ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌లో దర్శకుడు డాక్టర్ ప్రదీప్ అల్లు, హీరో వికాస్‌, నటుడు సత్య ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement