హీరోయిన్ నమిత విడాకులు తీసుకోనుందా? | Actress Namitha Divorce Rumours And Her Response | Sakshi
Sakshi News home page

Namitha: విడాకుల రూమర్స్‌పై స్పందించిన హీరోయిన్

Published Tue, May 28 2024 7:26 AM | Last Updated on Tue, May 28 2024 8:46 AM

Actress Namitha Divorce Rumours And Her Response

ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో విడాకుల వార్తలు ఎక్కువయ్యాయి. వాళ్లు వీళ్లు అనే తేడా లేకుండా చాలామంది సెలబ్రిటీలు విడిపోతున్నారు. ధనుష్-ఐశ్వర్య రజనీకాంత్, మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్.. రీసెంట్ టైంలోనే విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు ఒకప్పటి హీరోయిన్ నమిత కూడా భర్త నుంచి విడిపోనుందనే రూమర్స్ వస్తున్నాయి. వీటిపై ఇప్పుడు స్వయంగా ఆమెనే స్పందించింది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ రెండు మాత్రం స్పెషల్)

గుజరాత్‌కు చెందిన నమిత.. 'సొంతం' అనే తెలుగు మూవీతో హీరోయిన్ అయింది. ఆ తర్వాత తమిళ చిత్రాల్లోనూ నటించి అక్కడ సెటిలైపోయింది. 2017లో వీరేంద్ర చౌదరి అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లాడింది. ఈ జంటకు 2022లో కవల పిల్లలు పుట్టారు. ప్రస్తుతం రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్న నమిత.. తన భర్త నుంచి విడిపోయిందనే కామెంట్స్ వైరల్ అయ్యాయి. దీంతో నమిత స్పందించాల్సి వచ్చింది.

'ఈ మధ్యే భర్తతో కలిసి ఫొటోలు పోస్ట్ చేశాను. అయినప్పటికీ ఎలాంటి ఆధారాలతో మేం విడిపోయామని ప్రచారం చేస్తున్నారో అర్థం కావడం లేదు. నటిగా నేను ఈ రంగంలో చాలా వదంతులు ఎదుర్కొన్నాను. ఇప్పుడొచ్చిన దానితో నేను-నా భర్త ఏం బాధపడట్లేదు. ఫుల్లుగా నవ్వుకున్నాం' అని నమిత చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి ఆరేళ్ల తర్వాత తెలుగు థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement