Senior Actress Aamani Interesting Comments About Casting Couch In Film Industry - Sakshi
Sakshi News home page

Aamani: ఆ సీన్ కోసం డ్రెస్సు తీసేయమన్నారు.. క్యారెక్టర్‌ వద్దని చెప్పా: ఆమని

Published Wed, Aug 9 2023 4:53 PM | Last Updated on Wed, Aug 9 2023 5:49 PM

Aamani Interesting Comments About Casting Couch In Cinema Industry - Sakshi

తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటి ఆమని.  తెలుగులో జంబలకిడిపంబ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది.  ఆ తర్వాత బాపు దర్శకత్వం వహించిన మిస్టర్ పెళ్లాం సినిమాలో ఆమనికి మంచి పేరు తీసుకొచ్చింది. ఆ సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ ఫిల్మ్ అవార్డు అందుకుంది. తెలుగుతో పాటు తమిళంలో చాలా సినిమాల్లో నటించింది.  

ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఆమని.. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ నటనలో అడుగుపెట్టింది. ఈ ఏడాదిలో వినరో భాగ్యము విష్ణుకథ, అల్లంత దూరాన చిత్రాల్లో కీలక పాత్ర పోషించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమని కెరీర్‌ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ముఖ్యంగా హీరోయిన్స్ క్యాస్టింగ్ కౌచ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. 

(ఇది చదవండి: చంద్రముఖి చైల్డ్‌ ఆర్టిస్ట్‌ ఇప్పుడెలా ఉంది? ఏం చేస్తుందంటే?)

ఆమని మాట్లాడుతూ..'హీరోయిన్లలకు క్యాస్టింగ్‌ కౌచ్ సమస్యలు ఎప్పటినుంచో ఉన్నాయి. అప్పుడు సోషల్ మీడియా లేదు. అందుకే ఎవరికీ తెలియకపోయేది. ఏ వృత్తిలోనైనా సరే మంచి, చెడు రెండు ఉంటాయి. హీరోయిన్స్‌గా అది మనం డెసిషన్ తీసుకోవాలి. తమిళంలో ఇలాంటి పరిస్థితి నాకు ఎదురైంది. కొన్ని చిన్న సంస్థల్లో ఇలాంటివీ జరిగేవి. నాకు ఒకసారి స్విమ్మింగ్‌ పూల్‌ సీన్‌ కోసమని డ్రెస్సు తీసి ఏమైనా స్ట్రెచ్‌ మార్కులు ఉన్నాయేమో చూడాలి అన్నారు. కానీ నేను ఒప్పుకోలేదు. ఇలాంటి వారు కేవలం వాటి కోసమే వస్తారు. నేను వెంటనే అలాంటి క్యారెక్టర్‌ను వద్దనేదాన్ని. ఈ విషయంలో హీరోయిన్స్‌ వ్యక్తిగత నిర్ణయం. మనం ఎవరినీ తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కొందరు అడ్వాన్స్ ఇచ్చినా వెంటనే ఫోన్ చేసేవారు. డైరెక్టర్‌ స్టోరీ గురించి మాట్లాడాలన్నారు. మీరు రావాలంటా అని మేనేజర్ ఫోన్ చేసేవారు. కానీ ఈ విషయాలు నాకు చాలా రోజులకు అర్థమయ్యేవి. ' అని అన్నారు. 

ఆమని ఓ సంఘటనపై మాట్లాడుతూ..' అప్పుడు సెల్‌ఫోన్స్ లేవు కదా. డైరెక్ట్‌గా మేనేజర్ వచ్చి మాట్లాడేవారు. డైరెక్టర్ స్టోరీ గురించి మాట్లాడాలని అన్నారు. అది కూడా ఓ బీచ్ దగ్గర అని చెప్పారు. అక్కడికి మిమ్మల్ని రమ్మంటున్నారు సార్. ఫైనాన్షియర్ వస్తున్నారు మిమ్మల్ని చూడాలంటా అన్నారు. అసలు ఫైనాన్షియర్ నన్ను ఎందుకు చూడాలి? డైరెక్టర్, నిర్మాత చూస్తే చాలు కదా. ఇంకా ఎక్కువ అనుకుంటే హీరో చూడాలి. ఎందుకంటే ఆయన పక్కన నటించేవారు కాబట్టి తప్పదు. కానీ ఫైనాన్షియర్ చూడటమేంటి? అని అనుమానం వచ్చేది. కానీ కొన్ని రోజుల తర్వాత నాకు అర్థమైంది. ఒక్కోసారి మమ్మీ వద్దండీ.. మీరు మాత్రమే రండి అని కారు తీసుకొచ్చే వారు. అక్కడే నాకు వారి మైండ్‌సెట్‌ అర్థమయ్యేది. ఐ యామ్ సారీ.. నేను రాను అని చెప్పేదాన్ని. ' అంటూ సమామాధానమిచ్చింది. 

(ఇది చదవండి: భార్యతో స్టార్ హీరో విడాకులు.. కానీ మామతో ప్రత్యేక అనుబంధం!)


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement