No Headline | - | Sakshi
Sakshi News home page

No Headline

Published Sat, Apr 20 2024 1:25 AM | Last Updated on Sat, Apr 20 2024 1:25 AM

-

ఇంద్రవెల్లి: 1981 ఏప్రిల్‌ 20 జల్‌..జంగల్‌...జమీన్‌ కోసం ఉద్యమించిన అడవిబిడ్డలపై అప్పటి సర్కారు తుపాకీ ఎక్కుపెట్టింది. తూటాల వర్షం కురిపించింది. హక్కుల సాధనలో 15 మంది గిరిజనులు అమరులయ్యారు. వారి రక్తపుటేరులతో తడిసిన పచ్చని వనం ఎరుపెక్కింది. అడవిబిడ్డల అమరత్వం నింగికెగిసిన అగ్ని శిఖలా ఇంద్రవెల్లిలో అమరుల స్తూపమై నిలిచింది. ఈ ఘటనకు 43 ఏళ్లు. అయితే ఇప్పటికీ ఆ స్తూపం వద్ద ఏటా ఆదివాసీలు స్వేచ్ఛగా నివాళులు అర్పించలేని పరిస్థితి. నాడు పూర్తిగా పోలీసు నిఘాలోనే స్తూపం ఉండేది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరం 2015లో తొలిసారిగా ఆంక్షలతో కూడిన అనుమతి ఇవ్వడంతో వందల మంది ఆదివాసీలు వచ్చి అమరులకు నివాళులర్పించారు. ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయకపోవడంతో కలెక్టర్‌, ఎస్పీకి పలువురు ఆదివాసీ సంఘాల నాయకులు విన్నవించారు. ఈ మేరకు రెండు గంటలపాటు అనుమతి ఇచ్చారు. నాటి నుంచి ఆదివాసీలు సంప్రదాయ పూజలతో నివాళులర్పిస్తూనే ఉన్నారు. ఈసారి ఉమ్మడి జిల్లా నుంచి ఆదివాసీలతోపాటు జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క, ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్‌, ఆదివాసీ ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరుకానున్నారు. స్తూపం వద్ద ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement