సీఎం రోడ్‌షోకు జనాలు కరువు | - | Sakshi
Sakshi News home page

సీఎం రోడ్‌షోకు జనాలు కరువు

Published Sat, Apr 20 2024 1:40 AM | Last Updated on Sat, Apr 20 2024 1:40 AM

- - Sakshi

దొడ్డబళ్లాపురం: గ్యారంటీల పేరు చెప్పి జనాలకు ఎంతో చేస్తున్నామని చెప్పుకుంటున్న కాంగ్రెస్‌ పార్టీకి అందులోనూ ముఖ్యమంత్రికి దొడ్డ పట్టణంలో పరాభవం జరిగింది. చిక్కబళ్లాపురం పార్లమెంటు నియోజకవర్గం నుండి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రక్ష రామయ్యకు మద్దతుగా గురువారం రాత్రి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య,మంత్రి కేహెచ్‌ మునియప్ప తదితరులు దొడ్డ పట్టణంలో రోడ్‌ షో నిర్వహించి ఎన్నికల ప్రచారం చేసారు. అయితే జనం లేక రోడ్‌షో వెలవెలబోయింది. స్థానిక కాంగ్రెస్‌ నాయకులు జన సమీకరణ చేయడంలో విఫలమయ్యారో లేక జనం ఆసక్తి లేక రాలేదో కాని రోడ్‌షోలో కనీసం జిందాబాద్‌లు కొట్టే కార్యకర్తలూ కరువయ్యారు. దీంతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రోడ్‌షో సగంలో చాలించి వెనుదిరిగారు.

నటి హర్షికపై దౌర్జన్యం

యశవంతపుర: కారు పార్కింగ్‌ విషయంపై నటి హర్చికాపూణచ్చ, ఆమె భర్త భువన్‌పై దాడికి యత్నించారు. ఈ ఘటన బెంగళూరు పులకేశినగరలో జరిగింది. పార్కింగ్‌ విషయంపై వివాదం మొదలై హర్షికా మెడలోని బంగారు చైన్‌ను లాక్కొవటానికి యత్నించారు. ఘటనకు సంబంధించి హర్షికా పూణచ్చ వీడియో తీసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రయోజనం లేక పోవటంతో జరిగిన ఘటనను సామాజిక మాధ్యమాల్లో గోడు వెళ్లబోసుకున్నారు. బెంగళూరు నగరంలో స్థానికులకు ఎంత రక్షణ ఉందో ఈ ఘటనతో అర్థమవుతుందని, తనపై జరిగిన ఘటనను ఆమె చెప్పుకొచ్చారు. తనకు జరిగిన అవమానం, దౌర్జన్యం మరోకరికి జరగకూడదనే ఉద్దేశంతో వీడియోను పోస్ట్‌ చేసినట్లు తెలిపారు.

కూటమికి జై కొట్టండి

విజయపుర(బెంగళూరు గ్రామీణ): లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్‌ కూటమిని గెలిపిస్తే జోడెడ్లుగా పనిచేస్తూ మంచి పాలన అందిస్తామని చిక్కబళ్లాపుర అభ్యర్థి కే. సుధాకర్‌ అన్నారు. శుక్రవారం విజయపుర పట్టణంలో మాజీ ఎమ్మెల్యే జీ చంద్రణ్ణ, పిళ్ళముని శ్యామప్ప, నిసర్గ నారాయణ స్వామితో కలిసి విజయపుర పట్టణంలో వేలాదిమంది కార్యకర్తల మధ్య రోడ్‌షో నిర్వహించారు. సుధాకర్‌ మాట్లాడుతూ నరేంద్రమోదీని మళ్లీ ప్రధానిని చేసేందుకు దేశం మొత్తం ఎదురు చూస్తోందన్నారు.

టిప్పర్‌ ఢీకొని బైకిస్టు మృతి

యశవంతపుర: టిప్పర్‌ ఢీకొని బైకిస్టు మృతి చెందాడు. ఈ ఘటన ఉడుపిలో శుక్రవారం జరిగింది. బ్రహ్మవర మటపాడికి చెందిన ప్రభాకర్‌ ఆచారి బైక్‌పై పెరంపల్లి నుంచి అంబాగిలు మొయిన్‌ రోడ్డులో వెళ్తుండగా ఎదురుగా వచ్చిన టిప్పర్‌ ఢీకొంది. ప్రమాద తీవ్రతకు బైక్‌ టిప్పర్‌ కిందకు దూసుకెళ్లింది. ప్రభాకర్‌ ఆచారి మృతి చెందగా వెనుక కూర్చున్న మరో వ్యక్తికి బలమైన గాయాలయ్యాయి. క్షతగాత్రున్ని పోలీసులు మణిపాల్‌ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.

నినాదాలు చేస్తే దాడులు చేయడం హేయం

గౌరిబిదనూరు: రాష్ట్రంలో హిందువుల పరిస్థితి హీనంగా ఉందని, శ్రీరామ నవమి రోజున జైశ్రీరాం వినాదాలు చేసిన హిందూ యువకులపై అల్ప సంఖ్యాక యువకులు దాడి చేయడం హేయమని, ఈ ఘటనతో రాష్ట్రంలో హిందువుల పరిస్థితి అర్థమవుతుందని బీజేపీ నాయకుడు రవినారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం బీజేపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...ప్రతి హిందువు బీజేపీ పరంగా వుండాలన్నారు. నరేంద్ర మోదీని మరోమారు ప్రధాని చేయాలన్నారు. జేడీఎస్‌ తాలూకా అధ్యక్షుడు మంజునాథరెడ్డి మాట్లాడుతూ... జేడీఎస్‌–బీజేపీల మధ్య సమన్వయం లేదనే వారికి ఈ సమావేశం బుద్ధి చెబుతుందన్నారు. సమావేశంలో జేడీఎస్‌ నాయకుడు సీకల్‌ రామచంద్రప్ప, బీజేపీ రూరల్‌ అధ్యక్షుడు రమేశ్‌ రావ్‌, జేడీఎస్‌ సిఆర్‌ నరసింహమూర్తి, బిజి వేణుగోపాలరెడ్డి, బైపాస్‌ నాగరాజు, హరీశ్‌, ముద్దు వీరప్ప తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
రోడ్‌షోలో పాల్గొన్న కూటమి అభ్యర్థి కె.సుధాకర్‌
1/3

రోడ్‌షోలో పాల్గొన్న కూటమి అభ్యర్థి కె.సుధాకర్‌

దొడ్డలో సీఎం రోడ్‌షో
2/3

దొడ్డలో సీఎం రోడ్‌షో

మాట్లాడుతున్న బీజేపీ–జేడీఎస్‌ నాయకులు
3/3

మాట్లాడుతున్న బీజేపీ–జేడీఎస్‌ నాయకులు

Advertisement
 
Advertisement
 
Advertisement