ఉప్పొంగిన ఉత్సాహం | - | Sakshi
Sakshi News home page

ఉప్పొంగిన ఉత్సాహం

Published Sat, Apr 20 2024 1:40 AM | Last Updated on Sat, Apr 20 2024 1:40 AM

రాయచూరులో బీజేపీ అభ్యర్ధి
రాజా అమరేశ్వర నాయక్‌ నామినేషన్‌  - Sakshi

సాక్షి,బళ్లారి: వచ్చే నెల 7వ తేదీన జరగనున్న రెండో దశ లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగిసింది. శుక్రవారం రెండో దశలో పోలింగ్‌ జరగనున్న బళ్లారి, రాయచూరు, హావేరి తదితర లోక్‌సభ నియోజకవర్గాల్లో అభ్యర్థులు కోలాహలంగా, ఉత్సాహంగా నామినేషన్లను సమర్పించారు. ముఖ్యంగా హావేరి లోక్‌సభ నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్న మాజీ సీఎం బసవరాజ్‌ బొమ్మై జనశక్తిని ప్రదర్శించారు. మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప తదితర ముఖ్య నేతలు హాజరు కావడంతో హావేరిలో భారీ జన సందోహం కనిపించింది. హుక్కేరి పీఠాధిపతి సదాశివ స్వామీజీ ఆశీర్వాదం తీసుకొని బృహత్‌ ర్యాలీలో పాల్గొని నామినేషన్‌ను సమర్పించారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌జోషి, లోక్‌సభ సభ్యుడు శివకుమార్‌ ఉదాసి, మాజీ మంత్రులు సీసీ పాటిల్‌, బీసీ పాటిల్‌ తదితరులు పాల్గొన్నారు.

అభ్యర్థుల నామినేషన్ల హోరు

రాయచూరు రూరల్‌: రాయచూరు, యాదగిరి జిల్లాల లోక్‌సభ బీజేపీ అభ్యర్థిగా రాజా అమరేశ్వర నాయక్‌ నామినేషన్‌ వేశారు. శుక్రవారం జిల్లాధికారి కార్యాలయంలో ఎన్నికల అధికారి, జిల్లాధికారి చంద్రశేఖర్‌ నాయక్‌కు ఆయన మరొక సెట్‌ నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. స్వతంత్ర అభ్యర్ధిగా యల్లమ్మ, ఎస్‌యూసీఐ అభ్యర్థిగా రామలింగప్ప, భారతీయ జన సామ్రాట్‌ అభ్యర్ధిగా శ్యామ్‌రావ్‌ నామినేషన్‌ అందించారు.

పీజేపీ అభ్యర్థి నామినేషన్‌

హొసపేటె: పీజేపీ(ప్రహార జనశక్తి పార్టీ) అభ్యర్థి మంజునాథ్‌ ఘోసల్‌ శుక్రవారం 2వ సెట్‌ నామినేషన్‌ పత్రాలను ఎన్నికల అధికారికి అందజేశారు. ఈ సందర్భంగా పీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.వెంకటేష్‌, కార్యకర్తలు వెంకోబ, పెద్ద విరుపయ్య వెంకటేష్‌, టీఎం రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

బీఎస్పీ అభ్యర్థి నామినేషన్‌

రాయచూరు రూరల్‌: రాయచూరు, యాదగిరి లోక్‌సభ స్థానానికి బహుజన సమాజ్‌ పార్టీ(బీఎస్పీ) అభ్యర్థిగా నరసణ్ణగౌడ నామినేషన్‌ వేశారు. శుక్రవారం జిల్లాధికారి కార్యాలయంలో ఎన్నికల అధికారి, జిల్లాధికారి చంద్రశేఖర్‌ నాయక్‌కు ఆయన తన నామినేషన్‌ పత్రాలను అందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
హావేరిలో నామినేషన్‌కు ర్యాలీగా 
వెళుతున్న నేతలు
1/7

హావేరిలో నామినేషన్‌కు ర్యాలీగా వెళుతున్న నేతలు

నామినేషన్‌ వేస్తున్న స్వతంత్ర 
అభ్యర్ధిని యల్లమ్మ
2/7

నామినేషన్‌ వేస్తున్న స్వతంత్ర అభ్యర్ధిని యల్లమ్మ

నామినేషన్‌ ర్యాలీలో పాల్గొన్న 
భారీ జనసందోహం
3/7

నామినేషన్‌ ర్యాలీలో పాల్గొన్న భారీ జనసందోహం

4/7

5/7

6/7

7/7

Advertisement
 
Advertisement
 
Advertisement