Karnataka Assembly Election Result 2023 High And Low Majority Winners List - Sakshi
Sakshi News home page

లక్‌ అంటే బీజేపీ అభ్యర్థి రామ్మూర్తిదే..! 16 ఓట్లతో ఎమ్మెల్యేగా గెలుపు.. డీకేశీదే అత్యధిక మెజారిటీ

Published Wed, May 17 2023 6:20 AM | Last Updated on Wed, May 17 2023 11:18 AM

- - Sakshi

ఎన్నికల్లో ఓట్లే ప్రధానం. ఒక్క ఓటు విజయాన్ని నిర్ణయిస్తుంది. రెండు ఓట్ల మెజారిటీ వచ్చినా, రెండు లక్షలు వచ్చినా విజేతలందరూ వెళ్లేది అసెంబ్లీకే. కానీ మెజారిటీ అనేది నియోజకవర్గంలో ఆ నాయకునికి ఉన్న పట్టుకు పలుకుబడికి నిదర్శనం. ఈ ఎన్నికల్లో కొందరు భారీ మెజారిటీతో గెలిస్తే, కొందరు మాత్రం ఏదో గెలిచామన్నట్లు ఎన్నికయ్యారు.

బనశంకరి: ఈ విధానసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 135 సీట్లతో జెండా ఎగరేయగా, బీజేపీ ప్రతిపక్షంగా అవతరించింది. ఎన్నికల్లో రాష్ట్రంలో 10 మంది అభ్యర్థులు అత్యధిక మెజారిటీతో ఎన్నిక కాగా, 8 మంది బొటాబొటీ ఆధిక్యంతో గెలిచినట్లయింది.

మెజారిటీ వీరులు వీరే
► కనకపుర నియోజకవర్గంలో కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ 1,22,392 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇదే అత్యధికం.

► చిక్కోడి సదలగా క్షేత్రంలో కాంగ్రెస్‌ అభ్యర్థి గణేశ్‌ హుక్కేరి 77,749 ఓట్ల మెజారిటీతో విజయం.

► అథణిలో కాంగ్రెస్‌ అభ్యర్థి లక్ష్మణ సవది 75,673 ఓట్లతో గెలుపు.

► బెంగళూరు పులకేశినగరలో కాంగ్రెస్‌ అభ్యర్థి ఏసీ శ్రీనివాస్‌కు 62,062 ఓట్ల మెజారిటీ

► కొళ్లేగాలలో కాంగ్రెస్‌ అభ్యర్థి ఏఆర్‌ కృష్ణమూర్తికి 59,519 ఓట్ల ఆధిక్యం. యమకనమరడిలో కాంగ్రేస్‌ అభ్యర్థి సతీశ్‌ జార్కిహొళికి 57,046 ఓట్లు, బెంగళూరు సర్వజ్ఞనగరలో కాంగ్రెస్‌ అభ్యర్థి కేజే.జార్జ్‌ 55,768 మెజారిటీ దక్కింది.

► బెళగావి రూరల్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి లక్ష్మీ హెబ్బాళ్కర్‌కి 55,546 ఓట్ల మెజారిటీ. బెంగళూరులో పద్మనాభనగరలో బీజేపీ అభ్యర్థి ఆర్‌.అశోక్‌ 55175 ఓట్ల మెజారిటీ. బసవనగుడిలో బీజేపీ అభ్యర్థి రవి సుబ్రమణ్యకు 54978 ఓట్ల ఆధిక్యం.

అత్యల్ప ఆధిక్యంతో ఎన్నిక
బెంగళూరు జయనగర నుంచి బీజేపీ అభ్యర్థి సీకే.రామ్మూర్తి 16 ఓట్ల అత్యంత స్వల్ప మెజారిటీతో ఎన్నికయ్యారు. అలాగే గాంధీనగరలో కాంగ్రెస్‌ అభ్యర్థి దినేశ్‌ గుండూరావ్‌కు వచ్చిన మెజారిటీ 105 ఓట్లు

శృంగేరిలో కాంగ్రెస్‌ అభ్యర్థి టీడీ రాజేగౌడ ఆధిక్యం 201 ఓట్లు

మాలూరు నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి కేవై నంజేగౌడ ఆధిక్యం 218 ఓట్లు

కుమటాలో బీజేపీ అభ్యర్థి దినకరశెట్టి ఆధిక్యం 673 ఓట్లు

మూడిగెరెలో కాంగ్రెస్‌ అభ్యర్థిని నయన మోటమ్మ 772 ఓట్ల మెజారిటీతో గెలుపు

చించోళిలో బీజేపీ అభ్యర్థి అవినాశ్‌ జాదవ్‌ మెజారిటీ 858 ఓట్లు కాగా, జగళూరులో కాంగ్రెస్‌ అభ్యర్థి దేవేంద్రప్ప 874 ఓట్లతో గెలిచారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement