అమెరికా వైట్‌హౌజ్‌ గేటుపైకి దూసుకెళ్లిన కారు Vehicle Crashes Into US White House Exterior Gate Washington | Sakshi
Sakshi News home page

అమెరికా వైట్‌హౌజ్‌ గేటుపైకి దూసుకెళ్లిన కారు

Published Tue, Jan 9 2024 9:24 AM | Last Updated on Tue, Jan 9 2024 11:45 AM

Vehicle Crashes Into US White House Exterior Gate Washington - Sakshi

వాషిం‍గ్టన్‌: అమెరికా వైట్‌హౌజ్‌ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. శ్వేత సౌధం కాంప్లెక్స్‌ బాహ్య ద్వారంపైకి  ఓ కారు వేగంగా దూసుకెళ్లింది. సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో వైట్‌హౌజ్‌ కాంప్లెక్స్‌ వద్ద కారు​ ప్రమాదం జరిగినట్లు యూఎస్‌ సిక్రెట్‌ సర్వీస్‌ పేర్కొంది.

ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి.. కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నామని, ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నామని  సిక్రెట్‌ సర్వీస్‌ ప్రతినిధి ఆంథోనీ గుగ్లీల్మి వెల్లడించారు. 

ఇక.. ఇటీవల అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ కాన్వాయ్‌ను గుర్తుతెలియని వ్యక్తి కారుతో ఢీకొట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో జోబైడెన్‌, జిల్‌ బైడెన్‌ క్షేమంగా బయటపడ్డారని యూఎస్‌ సిక్రెట్‌ సర్వీస్‌ పేర్కొన్న విషయం తెలిసిందే.

చదవండి: India-Maldives Row:మాల్దీవుల వివాదం: ద్వేషాన్ని భారత్‌ అస్సలు సహించదు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement