వీసా ఫీజులు పెంచిన అమెరికా US hikes visa fees for various categories of non-immigrant visas | Sakshi
Sakshi News home page

వీసా ఫీజులు పెంచిన అమెరికా

Published Fri, Feb 2 2024 4:03 AM | Last Updated on Fri, Feb 2 2024 4:03 AM

US hikes visa fees for various categories of non-immigrant visas - Sakshi

వాషింగ్టన్‌: అమెరికా ప్రభుత్వం హెచ్‌–1బీ, ఎల్‌–1, ఈబీ–5 తదితర నాన్‌ ఇమిగ్రెంట్‌ వీసా దరఖాస్తుల ఫీజులను పెంచుతున్నట్లు ప్రకటించింది. తాజా పెంపు ప్రకారం..భారతీయ టెక్కీలు ఎక్కువగా దరఖాస్తు చేసుకునే హెచ్‌–1బీ వీసా ఫీజు ప్రస్తుతమున్న 460 డాలర్ల నుంచి ఏకంగా 780 డాలర్లకు పెరిగింది. హెచ్‌–1బీ రిజిస్ట్రేషన్‌ ఫీజు కూడా 10 అమెరికన్‌ డాలర్ల నుంచి 215 డాలర్లకు పెరగనుంది.

రిజిస్ట్రేషన్‌ ఫీజు పెంపు వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రానుంది. అదే విధంగా,  ఎల్‌–1 వీసా ఫీజు 460 డాలర్ల నుంచి 1,385 డాలర్లకు, ఇన్వెస్టర్ల వీసాగా పిలిచే ఈబీ–5 కేటగిరీ వీసా ఫీజును ప్రస్తుతమున్న 3,675 డాలర్ల నుంచి ఏకంగా 11,160 డాలర్లకు పెంచుతున్నట్లు ఫెడరల్‌ ప్రభుత్వం బుధవారం ఒక నోటిఫికేషన్లో వివరించింది. 2016 తర్వాత మొదటిసారిగా చేపట్టిన వీసా ఫీజుల పెంపు ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి అమలు కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement