అమెరికాలో కూలిన బ్రిడ్జ్‌.. కంటైనర్‌ షిప్‌లోని 22 మంది సేఫ్‌ | US Bridge Collapses After Ship Collision mass casualties feared | Sakshi
Sakshi News home page

అమెరికాలో కూలిన బ్రిడ్జ్‌.. కంటైనర్‌ షిప్‌లోని 22 మంది సేఫ్‌

Published Tue, Mar 26 2024 2:50 PM | Last Updated on Tue, Mar 26 2024 8:08 PM

US Bridge Collapses After Ship Collision mass casualties feared - Sakshi

అమెరికాలో కుప్పకూలిన బాల్టీమోర్‌ బ్రిడ్జ్‌

సూటిగా వంతెనను ఢీకొట్టిన భారీ ఓడ

ప్రమాదం జరిగిందని ప్రాథమిక అంచనా

అంతలోనే ప్రమాదంపై అనుమానాలు

వాషింగ్టన్‌: అమెరికా మేరిల్యాండ్‌ నగరంలోని ఓ వంతెన కుప్పకూలింది. మంగళవారం తెల్లవారుజామున బాల్టిమోర్‌ పట్ణణంలోని పాలప్స్కో నదిపై ఉన్న ఫ్రాన్సిస్ స్కాట్ కీ వంతెనను సింగపూర్‌ జెండా ఉ‍న్న ఓ కంటెయినర్‌ అర్థరాత్రి 1:30 గంటలకు షిప్‌ ఢీ కొట్టడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వంతెన కుప్పకూలడంతో సుమారు 22 మంది నదిలో పడిపోయారని బాల్టిమోర్‌ పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో బ్రిడ్జ్‌పై నుంచి పలు వాహనాలు ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే బాల్టిమోర్‌లోని ప్రధాన వంతెనను ఢీకొట్టిన కార్గో షిప్‌లోని మొత్తం 22 మంది సిబ్బంది భారతీయులేనని ఓడ నిర్వహణ సంస్థ తాజాగా  వెల్లడించింది.  వారంతా సురక్షితంగా ఉన్నారని పేర్కొంది. అయితే  ఈ ప్రమాదంలో వంతెనపై ఉన్న కొన్ని కార్లు సైతం నదిలోకి దూసుకెళ్లాయి. ఇప్పటి వరకు అధికారులు ఇద్దరిని సురక్షింతగా బయటకు తీశారు. మరో ఏడుగురి ఆచూకీ తెలియాల్సి ఉన్నట్లు సమాచారం.

2.6 కిలోమీటర్ల నాలుగు లేన్ల బ్రిడ్జ్‌ కుప్పకూలిన సమయంలో​ పలు వాహనాలు బ్రిడ్జ్‌పై నుంచి ప్రయాణించినట్లు వీడియోలో కనిపిస్తోంది. వంతెన కూలిపోయిన వెంటనే పలు వాహనాలు నదిలో పడిపోయినట్లు బాల్టిమోర్ అగ్నిమాపక విభాగానికి చెందిన కెవిన్ కార్ట్‌రైట్ బాల్టిమోర్ తెలిపారు. తాము ఘటనాస్థలికి చేరుకునేలోపే వంతెన మొత్తం నీటిలో కూలిపోయిందని తెలిపారు. వెంటనే నదిలో సహాయక చర్యలు చేపట్టాని తెలిపారు. సుమారు 20 మంది వరకు నదిలో ముగినిపోయినట్లు తెలుస్తోందని బాల్టిమోర్‌ పోలిసులు పేర్కొన్నారు. ఈ వంతెనను 1977లో ప్రారంభించారని పేర్కొన్నారు. 

అమెరికాలో తెల్లవారుజామున, ఇంకా పొద్దుపొడవకముందే ఈ ప్రమాదం జరిగింది. ఇప్పుడిప్పుడే దీనికి సంబంధించిన తీవ్రత బయటపడుతోంది. ఓడను సూటిగా బ్రిడ్జివైపు ఎలా నడిపిస్తారు? కళ్ల ముందు అంత భారీ బ్రిడ్జ్‌ ఉంటే.. గుడ్డిగా ఎలా నడిపిస్తారు? నెటిజన్లు వ్యాఖ్యలు జోడించారు. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన ఉదయం 8 గంటల వరకు రాలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement