UNSC: బైడెన్‌ తీర్మానాన్ని స్వాగతించిన హమాస్‌ UN Security Council endorses US Gaza ceasefire resolution. Sakshi
Sakshi News home page

గాజా కాల్పుల విరమణ ఒప్పందం: భద్రతా మండలిలో అమెరికా తీర్మానం.. స్వాగతించిన హమాస్‌

Published Tue, Jun 11 2024 8:36 AM | Last Updated on Tue, Jun 11 2024 3:40 PM

UN Security Council endorses US Gaza ceasefire resolution

న్యూయార్క్‌: గాజా యుద్ధంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య కాల్పుల విరమణ కోసం ఐక్యరాజ్యసమతి భద్రతామండలిలో అగ్రరాజ్యం అమెరికా సోమవారం తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. రష్యా మినహా మిగతా 14 భద్రతా మండలి సభ్య దేశాలు ఈ కాల్పుల విరమణ ప్రతిపాదనకు అనుకూలంగా ఓటు వేశారు.

మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రతిపాదించిన ఈ తీర్మానాన్ని హమాస్‌ స్వాగతించింది. కాల్పుల విరమణ కోసం మధ్యవర్తులు అమలు చేసే ప్రణాళికకు మద్దుతుగా ఉంటామని, అది కూడా పాలస్తీనా ప్రజలకు డిమాండ్లకు అనుగుణంగా ఉంటుందని ఆశిస్తున్నామని హమాస్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

మే 31న ఇజ్రాయెల్‌ చొరవతో మూడు దశల కాల్పుల విరమణ ప్రణాళికను రూపొందించినట్లు అధ్యక్షుడు బైడెన్ తెలిపారు. ‘ఈ రోజు మేము శాంతి కోసం  ఓటు వేశాం’ అని ఐరాసలో యూఎస్ అంబాసిడర్‌ లిండా థామస్ గ్రీన్‌ఫీల్డ్ అన్నారు.  

ఇక ఈ తీర్మానాన్ని​ ఇజ్రాయెల్‌ సైతం అంగీకరించింది. హమాస్‌ కూడా ఈ తీర్మానాన్ని అంగీకరించాలని కోరింది.  హమాస్, పాలస్తీనా మధ్య అంతర్జాతీయంగా కాల్పుల విరమణ కోసం ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే  ఇరు పక్షాలు అంగీకరించనట్లు  తెలుస్తోంది. అమెరికా విదేశాంగ మంత్రి శాంతి ఒప్పదం కోసం  ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో పాటు పలువురు అంతర్జాతీయ నేతలతో సమావేశం అయిన అనంతరం  ఈ ఒప్పందానికి ఇజ్రాయెల్‌ అంగీకారం తెలిపింది. ఇక.. ఈ  తీర్మాణంపై రష్యా విమర్శలు గుప్పించింది. ఇజ్రాయెల్‌ నుంచి వివరణాత్మక ఒప్పందాలు లేకపోవడాన్ని రష్యా ఎత్తిచూపింది. 

తీర్మానం ప్రకారం.. కాల్పుల విరణమ ప్రణాళిక మూడు దశల్లో కొనసాగుతుంది. మొదటి దశలో   ఇజ్రాయెల్‌ బందీలు,  పాలస్తీనా ఖైదీల మార్పిడితో కూడిన కాల్పుల విరమణ  ఉంటుంది. రెండో దశలో ఇరుపక్షాలు శత్రుత్వానికి శాశ్వతంగా ముగింపు పలకాలి. అలాగే గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలి. మూడో దశలో గాజా పునర్నిర్మాణంపై దృష్టి పెట్టే ప్రణాళికను అమలు చేయటం జరుగుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement