కేర్‌ వర్కర్లు కుటుంబీకుల్ని తీసుకురావద్దు | UK ban on overseas care workers bringing family members | Sakshi
Sakshi News home page

కేర్‌ వర్కర్లు కుటుంబీకుల్ని తీసుకురావద్దు

Published Tue, Mar 12 2024 5:08 AM | Last Updated on Tue, Mar 12 2024 5:08 AM

UK ban on overseas care workers bringing family members - Sakshi

ఈ వారం నుంచి నిషేధాన్ని అమల్లోకి తెస్తున్న బ్రిటన్‌

లండన్‌: ఇంటి పనుల్లో సాయపడే కేర్‌ వర్కర్లు ఇకపై తమ వెంట కుటుంబసభ్యులను బ్రిటన్‌కు తీసుకురావడానికి వీల్లేదంటూ బ్రిటన్‌ ప్రభుత్వం తేలి్చచెప్పింది. ఈ నూతన వలస విధానాన్ని ఈ వారం నుంచే అమలుచేసే అవకాశముంది. ఈ విషయమై బ్రిటన్‌ హోం శాఖ మంత్రి జేమ్స్‌ క్లెవెర్లీ మాట్లాడారు.

‘‘ కేర్‌ వీసా విధానం ద్వారా గత ఏడాది 1,00,000 మంది కేర్‌ వర్కర్లను బ్రిటన్‌లోకి అనుమతిచ్చాం. అయితే వారి వెంట 1,20,000 మంది డిపెండెంట్‌లు వచ్చారు. ఇది వీసా దుర్వినియోగాలపై మేం తీసుకుంటున్న చర్యలకు విఘాతం కల్గిస్తోంది. ఇలాంటి పరిస్థితిని అనుమతించబోం’ అని అన్నారు. దీనికి సంబంధించిన నూతన వలస విధానాన్ని గురువారమే ప్రభుత్వం పార్లమెంట్‌ ముందుంచనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement