Afghanistan Government Formation Postponed Again - Sakshi
Sakshi News home page

అఫ్గాన్‌లో ప్రభుత్వ ఏర్పాటు మళ్లీ వాయిదా

Published Sun, Sep 5 2021 2:44 AM | Last Updated on Sun, Sep 5 2021 11:41 AM

Talibans postpone Afghan new government formation again - Sakshi

కాబూల్‌: అఫ్గానిస్తాన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు తాలిబన్లు చేస్తున్న కసరత్తు ఇంకా కొలిక్కి రాలేదు. అంతర్జాతీయ సమాజం ఆమోదం పొందేలా ప్రభుత్వాన్ని తీర్చిదిద్దే పనిలో ఉన్న తాలిబన్లు కొత్త ప్రభుత్వ ఏర్పాటును వచ్చే వారానికి వాయిదా వేశారు. ఈ విషయాన్ని ఆ ముఠా అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్‌ వెల్లడించారు. తాలిబన్‌ సహ వ్యవస్థాపకుడు, రాజకీయ విభాగం చీఫ్‌ ముల్లా అబ్దుల్‌ ఘనీ బరాదర్‌ ప్రభుత్వాధినేతగా శనివారమే అఫ్గాన్‌లో ప్రభుత్వం ఏర్పాటు కావాల్సి ఉంది. కానీ, చర్చలు ఇంకా పూర్తి కాకపోవడంతో వచ్చే వారం ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసింది. ప్రపంచ దేశాల మద్దతు లభించేలా ప్రభుత్వాన్ని కూర్చే పనిలో ఉండడం వల్లే కొత్త ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యం అవుతోందని తాలిబన్‌ చర్చల కమిటీ సభ్యుడు ఖలీల్‌ హక్కానీ చెప్పారు. తాలిబన్లకి ఇప్పటికే మద్దతు ప్రకటించిన జమైత్‌ ఏ ఇస్లామీ అఫ్గానిస్తాన్‌ చీఫ్, దేశ మాజీ అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీ సోదరుడైన గుల్బుద్దీన్‌ హెక్మత్యార్‌కు ప్రభుత్వంలో చోటు లభించనుంది.  

పంజ్‌ïÙర్‌లో కొనసాగుతున్న పోరాటం
అఫ్గానిస్తాన్‌లో పంజ్‌ïÙర్‌ లోయ ఇంకా తాలిబన్ల వశం కాలేదు. శనివారం మళ్లీ ఇరు వర్గాల మధ్య పోరాటం మొదలైంది. ఇప్పటివరకు తాలిబన్ల కన్ను పడని పంజ్‌ïÙర్‌ను ఆక్రమించుకున్నట్టుగా శుక్రవారం వార్తలు వచ్చాయి. అయితే అవి కేవలం వదంతులేనని తేలింది. పంజ్‌ïÙర్‌ తమ స్వాధీనంలోకి వచి్చందని ఇప్పటివరకు తాలిబన్లు అధికారికంగా ఎలాంటి  ప్రకటన చేయలేదు. సోవియెట్‌ యూనియన్‌ ఆక్రమణలో ఉన్నప్పుడు, తాలిబన్ల పరిపాలనలోనూ పంజ్‌ïÙర్‌ స్వతంత్రంగానే వ్యవహరించింది. 1996–2001 మధ్య కాలంలో తాలిబన్లు అటు వైపు కన్నెత్తి కూడా చూడలేకపోయారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముందే ఆ ప్రాంతాన్ని కూడా తమ వశం చేసుకోవాలని తాలిబన్లు గట్టి పట్టుదలతో ఉన్నారు.  దేశ మాజీ ఉపాధ్యక్షుడు అమరుల్లా సలే, తాలిబన్లను తీవ్రంగా వ్యతిరేకించే అహ్మద్‌ షా మసూద్‌ కుమారుడు అహ్మద్‌ మసూద్‌ల అ«దీనంలో పంజ్‌షీర్‌ లోయ ఉంటుంది.  

గాల్లోకి కాల్పులు.. 17 మంది మృతి!
పంజ్‌ïÙర్‌ తాలిబన్ల పరమైందని వదంతులు వ్యాపించడంతో రాజధాని కాబూల్‌లో తాలిబన్లు గాల్లోకి కాల్పులు జరుపుతూ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు.  ఈ కాల్పుల్లో 17 మంది వరకు మరణించినట్టు తెలుస్తోంది. అయితే వారు అలా సంబరాలు చేసుకోవడాన్ని తాలిబన్ల అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్‌ తప్పు పట్టారు. ఆయుధాలనేవి ప్రభుత్వ ఆస్తి అని, వాటిని  గాల్లోకి పేలుస్తూ వృథా చేయరాదని హితవు చెప్పారు.  

మహిళా కార్యకర్త తలకి గాయాలు
మహిళలు తమ హక్కుల్ని కాపాడాలంటూ చేస్తున్న ఉద్యమాన్ని తాలిబన్లు అణగదొక్కేస్తున్నారు.  మహిళలు తమ రాజకీయ హక్కుల్ని కాపాడా లంటూ అధ్యక్ష భవనం వరకు తీసిన ర్యాలీని తాలిబన్లు అడ్డుకొని బాష్పవాయువు ప్రయోగిం చారు. మహిళల్ని విచక్షణారహితంగా కొట్టినట్టుగా టోలో న్యూస్‌ వెల్లడించింది. ఉద్యమకారిణి నర్గీస్‌ సద్దాత్‌ను చితకబాదారు. తలకి బలమైన గాయంతో ముఖమంతా నెత్తురోడుతూ ఆమె ఆ నిరసన ప్రదర్శనలో కనిపించారు.

అందరినీ కలుపుకొని పోవాలి: అమెరికా
తాలిబన్లు ఎలాంటి ప్రతీకార చర్యలకు దిగకుండా అన్ని వర్గాలను కలుపుకొని పోతూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని తాము ఆశిస్తున్నట్టు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌ అన్నారు. ఉగ్ర వాదాన్ని నిరోధించడం, మహిళలు, మైనారీ్టల హ క్కుల్ని గౌరవించడంలో తమ చిత్తశుద్ధి చూపించాలన్నారు.  మరోవైపు అఫ్గాన్‌లో మానవ సంక్షోభం, ఆరి్థక సమస్యలపై చర్చించేందుకు ఈ నెల 13న జెనీవాలో ఐక్యరాజ్యసమితి సమావేశం కానుంది.

కాబూల్‌కు ఐఎస్‌ఐ చీఫ్‌  
ఒకవైపు ప్రభుత్వ ఏర్పాటుకు మంతనాలు, మరోవైపు పంజ్‌ïÙర్‌లో కొనసాగుతున్న పోరాటం నేపథ్యంలో పాకిస్తాన్‌లో అత్యంత శక్తిమంతమైన ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్‌ (ఐఎస్‌ఐ) చీఫ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ ఫయీజ్‌ హమీద్‌ కాబూల్‌కు చేరుకున్నారు. ఆయన వెంట పాక్‌ అధికారుల బృందం కూడా వచి్చంది. తాలిబన్ల ఆహా్వనం మేరకే హమీద్‌ అఫ్గాన్‌ వచ్చారని, రెండు దేశాల భవితవ్యంపై చర్చలు జరిపి, కలసికట్టుగా వ్యూహరచన చేయనున్నట్టుగా పాకిస్తాన్‌ అబ్జర్వర్‌ పత్రిక వెల్లడించింది. ప్రభుత్వ ఏర్పాటుకు తాలిబన్లు ఐఎస్‌ఐ చీఫ్‌ను ఆహా్వనించడంతో వారిమధ్య సుదృఢ బంధాలు తేటతెల్లమవుతున్నాయి. తాలిబన్‌ అగ్ర నేతలు, కమాండర్లతో ఐఎస్‌ఐ చీఫ్‌ çచర్చలు జరపనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement