కూలిపోతున్న స్పేస్‌ ఎక్స్‌ శాటిలైట్లు Solar Storm Destroys 40 New SpaceX Satellites in Orbit | Sakshi
Sakshi News home page

కూలిపోతున్న స్పేస్‌ ఎక్స్‌ శాటిలైట్లు

Published Thu, Feb 10 2022 6:34 AM | Last Updated on Thu, Feb 10 2022 6:35 AM

Solar Storm Destroys 40 New SpaceX Satellites in Orbit - Sakshi

కేప్‌ కన్నవెరల్‌: సౌర తుఫాన్ల కారణంగా తమ కొత్త శాటిలైట్లలో కనీసం 49 దాకా తమ కక్ష్యల నుంచి జారి తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశించి కాలిపోయినట్టు స్పేస్‌ ఎక్స్‌ ప్రకటించింది. ‘‘గత వారం ప్రయోగించిన వీటిలో చాలావరకు తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశించి కాలిపోయాయి. మిగతావీ కూడా అదే బాటలో ఉన్నాయి’’ అని చెప్పింది.

గత శుక్రవారం నాటి జియోమాగ్నటిక్‌ తుఫాన్ల దెబ్బకు వాతావరణ సాంద్రత పెరగడం తమ శాటిలైట్ల పుట్టి ముంచిందని వివరించింది. ఒక్కోటీ కేవలం 260 కిలోలుండే ఈ బుల్లి శాటిలైట్లను కాపాడేందుకు గ్రౌండ్‌ కంట్రోలర్లు ఎంతగా ప్రయత్నించినా లాభం లేకపోయిందని వాపోయింది. అయితే స్పేస్‌ ఎక్స్‌కు చెందిన కనీసం 2,000 స్టార్‌ లింక్‌ శాటిలైట్లు దాదాపు 550 కిలోమీటర్ల ఎత్తులో భూమికి చుట్టూ తిరుగుతూ ప్రపంచంలోని మారుమూలలకు ఇంటర్నెట్‌ కనెక్టివిటీ సమకూరుస్తున్నాయి.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement