రష్యా జైలులో ‘ఐసిస్‌’ కలకలం Russian forces kill Islamic State-linked Hostage Takers | Sakshi
Sakshi News home page

రష్యా జైలులో ‘ఐసిస్‌’ కలకలం.. సిబ్బందిని బందించిన ఖైదీలు

Published Sun, Jun 16 2024 7:11 PM

Russian forces kill Islamic State-linked Hostage Takers

మాస్కో: రష్యాలోని ఓ డిటెన్షన్‌ సెంటర్‌లో కొంతమంది విచారణ ఖైదీలు సిబ్బందిని బందీలుగా పట్టుకోవడం సంచలనం రేపింది. ఈ షాకింగ్‌ ఘటనతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు జైలు సిబ్బందిని నిర్బంధించిన ఖైదీల్లో కొందరిని అంతమొందించారు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం రోస్తోవ్-ఆన్-డాన్ నగరంలో ఉన్న ప్రీ-ట్రయల్ డిటెన్షన్ సెంటర్‌లో ఆరుగురు ఖైదీలు ఇద్దరు జైలు గార్డులను బందీలుగా పట్టుకున్నారు. ఆ ఖైదీలకు ఉగ్రవాదసంస్థ ఇస్లామిక్ స్టేట్ గ్రూపు(ఐసిస్‌)తో సంబంధాలున్నట్లు ఆరోపణలున్నాయి. వారి వద్ద మారణాయుధాలున్నట్లు అధికారులు తెలిపారు.

ఖైదీల బారి నుంచి ఇద్దరు  సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారని, వారికి ఎలాంటి గాయాలు కాలేదని రష్యా మీడియా తెలిపింది.  ఈ ఘటనలో ఎంతమంది ఖైదీలు మృతి చెందారనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. కాగా, ఈ ఏడాది మార్చిలో మాస్కోలోని ఓ మ్యూజిక్‌ కన్సర్ట్‌ హాల్‌పై ఐసిస్‌ ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 145 మంది ప్రాణాలు కోల్పోయారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement