డబ్బా చక్రాల సైకిల్‌.. ఈజీగానే తొక్కొచ్చు! | Russian Engineer Invents New Bicycle Runs On Square Tire | Sakshi
Sakshi News home page

డబ్బా చక్రాల సైకిల్‌.. ఈజీగానే తొక్కొచ్చు!

Published Sat, Apr 15 2023 9:28 AM | Last Updated on Sat, Apr 15 2023 10:20 AM

Russian Engineer Invents New Bicycle Runs On Square Tire - Sakshi

సైకిల్‌ అంటే ఎలా ఉంటుంది? రెండు పెద్ద చక్రాలు.. వాటిని అటాచ్‌ చేస్తూ ఫ్రేమ్, చైన్‌ అంతేకదా! సైకిల్‌ అనే కాదు.. ఏ వాహనానికైనా ఉండేది గుండ్రని టైర్లు, చక్రాలే. అలా కాకుండా సైకిల్‌కు చతురస్రాకారంలో టైర్లు ఉంటే? అలా సింపుల్‌గా తొక్కేసుకుంటూ వెళ్లిపోగలిగితే? అదెలా సాధ్యమనిపిస్తోంది కదా! రష్యాకు చెందిన ‘ది క్యూ’సంస్థ ఇంజనీర్‌ సెర్గీ గోర్డీవ్‌ మాత్రం దీనిని చేసి చూపించాడు. చతురస్రాకారంలో టైర్లను రూపొందించి.. సాధారణ సైకిల్‌ ఫ్రేమ్‌కు అమర్చి నడిపించాడు. దీనికి సంబంధించిన వీడియో యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది కూడా. 

‘స్క్వేర్‌’టైర్లతో నడిచేదెలా? 
యుద్ధ ట్యాంకుల చక్రాల్లో వాడే టెక్నాలజీని ‘స్క్వేర్‌ టైర్‌’సైకిల్‌లో వినియోగించారు. సింపుల్‌గా చెప్పాలంటే.. ఇందులో చక్రాలు మొత్తానికి మొత్తంగా తిరగవు. జస్ట్‌ వాటి అంచున ఏర్పాటు చేసే ప్రత్యేకమైన బెల్ట్‌ మాత్రమే కదులుతుంది. అలాగే ‘స్క్వేర్‌ వీల్‌’సైకిల్‌లో చతురస్రాకారపు వీల్స్‌ కదలకుండా అలాగే ఉంటాయి. సెర్గీ గోర్డీవ్‌ ప్రత్యేకమైన బెల్ట్‌ను తయారు చేసి వాటి అంచులో అమర్చాడు. పెడల్స్‌ తొక్కినప్పుడు ఆ బెల్ట్‌ కదిలేలా.. గేర్లను, చైన్‌లను అమర్చి అనుసంధానించాడు. పెడల్‌ను తొక్కినప్పుడు.. బెల్ట్‌ కదులుతూ సైకిల్‌ ముందుకు వెళుతుంది. ఇదో వినూత్న ఆలోచన, చాలా బాగుందని కొందరు నెటిజన్లు ప్రశంసిస్తుంటే.. అంతా బాగానే ఉందిగానీ.. స్పీడ్‌ బ్రేకర్లు, గుంతలు వస్తే పరిస్థితి ఏమిటన్న కామెంట్లూ వస్తున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement