Rishi Sunak Party Just Took A Pounding In UK Local Elections, Details Inside - Sakshi
Sakshi News home page

UK Local Elections: యూకే ‘స్థానికం’లో అధికార పక్షానికి ఎదురుదెబ్బ

Published Sat, May 6 2023 6:39 AM | Last Updated on Sat, May 6 2023 10:22 AM

Rishi Sunak party just took a pounding in UK local elections - Sakshi

లండన్‌: యూకే స్థానిక ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్‌ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ బాధ్యతలు చేపట్టాక జరిగిన మొదటి ఎన్నికలివి. ఇంగ్లండ్‌లోని 317 కౌన్నిళ్లకుగాను 230 కౌన్సిళ్లలోని 8 వేల సీట్లకు గురువారం ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు ప్రకటించిన ఫలితాల్లో అధికార పార్టీ 20కిపై కౌన్సిళ్లను కోల్పోయింది.

ఎన్నికలు జరిగిన 8 వేల సీట్లలో లేబర్‌ పార్టీ 1,384, కన్జర్వేటివ్‌ పార్టీ 1,041, లిబరల్‌ డెమోక్రాట్లు 768 సీట్లను సాధించాయి. 20 ఏళ్లుగా అధికారపక్షానికి కంచుకోటగా ఉన్న మెడ్‌వే లాంటి కౌన్సిళ్లను సైతం లేబర్‌ పార్టీ, లిబరల్‌ డెమోక్రాట్లు కైవసం చేసుకున్నారు. మరికొద్ది నెలల్లో సాధారణ ఎన్నికలు జరగనుండగా వెలువడిన ఈ ఫలితాలపై ప్రధాని రిషి సునాక్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement