గాజాపై మళ్లీ బాంబుల వర్షం.. 175 మంది మృతి Israeli strikes kill over 175 People In Gaza After Ceasefire Ends | Sakshi
Sakshi News home page

గాజాపై మళ్లీ బాంబుల వర్షం.. 175 మంది మృతి

Published Sat, Dec 2 2023 10:58 AM | Last Updated on Sat, Dec 2 2023 11:44 AM

Israeli strikes kill over 175 People In Gaza After Ceasefire Ends - Sakshi

వారం రోజుల విరమణకు తెర పడటంతో గాజా స్ట్రిప్​ మళ్లీ కాల్పులతో దద్దరిల్లుతోంది. విరామం అనంతరం ఇజ్రాయెల్​  శుకరవారం రెట్టించిన తీవ్రతతో మళ్లీ దాడులకు దిగింది. గాజాలోని ఇళ్లు, భవనాలపై క్షిపణులు, రాకెట్లు, బాంబులతో విరుచుపడిందిదీంతో ఖాన్​ యూనిస్​లో ఒక భారీ భవన సముదాయం నెలమట్టమైనట్లు తెలుస్తోంది.   హమాద్​లో కూడా ఒక అపార్ట్​మెంట్​పై క్షిపణుల వర్షం కురిపించింది. కాల్పుల విరమణ ముగిసిన తర్వాత జరిగిన దాడుల్లో గాజాలో కనీసం 178 మంది మరణించినట్లు హమాస్​ తాజాగా ప్రకటించింది.

దక్షిణ గాజాపై కూడా ఇజ్రాయెల్​ సేనలు తమ దాడులను ఉధృతం చేసేలా కనిపిస్తోంది. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలంటూ రోజంతా అక్కడ కరపత్రాలు జారవిడవడం దీన్ని బలపరుస్తోంది. అక్కడి ఖాన్​ యూనిస్​ తదితర ప్రాంతాలు ప్రమాదకరమైన యుద్ధ క్షేత్రాలుగా మారాయని వాటిలో హెచ్చరించింది.

‘యుద్ధ లక్ష్యాల సాధనకు పూర్తిగా కట్టుబడి ఉన్నాం. బందీలందరినీ విడిపించుకోవడం, హమాస్​ను నిర్మూలించడం, గాజా మరెప్పుడూ ఇజ్రాయెలీలకు ముపపుగా మారకుండా కట్టుదిట్టటమైన చర్యలు తీసుకునే దాకా సైనిక చర్య కొనసాగుతోంది’ అంటూ ఇజ్రాయెల్​ ప్రధాని బెంజమిన్​ నెతన్యాహూ కార్యాలయం పేర్కొంది.

మహిళా బందీలందరినీ వదిలేస్తామన్న ఒప్పంద వాగ్దానాన్ని హమాస్​ ఉల్లంఘించడం వల్లే దాడులను తిరిగి మొదలు పెట్టాల్సి వచ్చిందని నెతన్యాహూ అన్నారు. ఇజ్రాయెలే రక్త దాహంతో తమ ప్రాతిపాదనలన్నింటినీ బుట్టదాఖలు చేసి దాడులకు దిగిందని హమాస్​ రోపించింది. 

ఇక ఇజ్రాయెల్​ సైన్యం‌‌- హమాస్​ మిలిటెంట్ల మధ్య అక్టోబర్​ 7 ప్రారంభమైన భీకర యుద్ధం దాదాపు రెండు నెలలుగా సాగుతోంది. ఇజ్రాయెల్​ జరిపిన దాడుల్లో ప్పటి వరకు 13,300 మంది పాలస్తీనియన్లు మరణించారు. వీరిలో అధికంగా మహిళలు, చిన్నారులే ఉన్నారు .ఇటీవల ఏడు రోజులు కాల్పుల విరమణ ఒప్పందం  ప్రకటించుకున్నాయి. కాల్పుల విరమణ సమయంలో హమాస్‌ 100 మంది బందీలను విడుదల చేయగా, ఇజ్రాయెల్‌ 240 మంది పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టింది.

హమాస్‌ బందీల్లో ఐదుగురు చనిపోయారని ఇజ్రాయెల్‌ ధ్రువీకరించింది. మృతుల కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని వెల్లడించినట్లు ఆ దేశ సైన్యం తెలిపింది. ఇంకా హమాస్‌ వద్ద 137 మంది బందీలుగా ఉన్నారని, వారిలో  115 మంది పురుషులు, 20 మంది మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు వెల్లడించింది. ఇక గురువారం ఇజ్రాయెల్, హమాస్ మధ్య వారం రోజుల కాల్పుల విరమణ ఒప్పందం ముగియడంతో గాజాలో మళ్లీ కాల్పుల మోత మోగుతోంది.

👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement