గాజాలో ముగ్గురి ఇజ్రాయెల్‌ బంధీల మృతదేహాలు స్వాధీనం Israel IDF says bodies of three hostages deceased recovered | Sakshi
Sakshi News home page

గాజాలో ముగ్గురి ఇజ్రాయెల్‌ బంధీల మృతదేహాలు స్వాధీనం

Published Sat, May 18 2024 9:14 AM | Last Updated on Sat, May 18 2024 9:34 AM

Israel IDF says bodies of three hostages deceased recovered

గాజాలో హమాస్‌ మిలిటెంట్లలను అంతం చేయటమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ సైన్యం దాడులు కొనసాగిస్తోంది. తాజాగా శుక్రవారం అర్ధరాత్రి వరకు ఇజ్రాయెల్‌ సైన్యం చేపట్టిన ఆపరేషన్‌లో ముగ్గురు బంధీల మృత దేహాలను స్వాధీనం చేసుకుంది. ఈ విషయన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్‌ ఆర్మీ(ఐడీఎఫ్‌) ఓ ప్రకటనలో వెల్లడించింది.

‘అక్టోబర్‌ 7న  హమాస్‌ మిలిటెంట్లు  ఇజ్రాయెల్‌పై దాడిన చేసిన  సమయంలో షానీ లౌక్, అమిత్ బుస్కిలా , ఇత్జాక్ గెలెరెంటర్ సూపర్‌నోవా మ్యూజిక్‌ ఫెస్టివల్‌ పాల్గోన్నారు. ఆ సమయంలో దాడికి దిగిన హమాస్‌ మిలిటెంట్లు వారిని  చంపేసి.. మృతదేహాను తమతో పాటు గాజాకు తీసుకెళ్లారు’ అని ఐడీఎప్‌ అధికార ప్రతినిధి అడ్మిరల్ డేనియల్ హగారి తెలిపారు.

‘గాజా స్ట్రిప్‌లో భీకరమైన దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల బంధీలను తిరిగి తీసుకురావటమే ప్రధానమైన లక్ష్యంగా ప్రతి ఐడీఎఫ్‌ ప్రతి కమాండర్‌,  సైనికుడు యుద్ధరంగంలో పోరాడుతున్నారు. ఇజ్రాయెల్ సేనలు సురక్షితంగానే ఉన్నాయి. 

ఆర్మీపై పుకార్లు వ్యాప్తి చేయవద్దని ప్రజలను కోరారు. నిష్పక్షపాతంగా ఎప్పటికప్పుడు మేము బంధీల కుటుంబాలకు సమాచారం అందిస్తాం. అర్వాత ప్రజలకు తెలియజేస్తాం’ అని డేనియల్‌ హగారి పేర్కొన్నారు. ఇక.. ఇజ్రాయెల్‌ సైన్యం గాజాపై చేస్తున్న దాడిలో ఇప్పటివరకు 35, 272 మంది పాలస్తీనా పౌరులు మృతి చెందారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement