‘విరమణ’ మరో రెండు రోజులు | Israel-Hamas war: Israel-Hamas truce in Gaza extended two days | Sakshi
Sakshi News home page

‘విరమణ’ మరో రెండు రోజులు

Published Tue, Nov 28 2023 5:39 AM | Last Updated on Tue, Nov 28 2023 5:39 AM

Israel-Hamas war: Israel-Hamas truce in Gaza extended two days - Sakshi

ఖాన్‌ యూనిస్‌/టెల్‌ అవీవ్‌: ఇజ్రాయెల్‌–హమాస్‌ మిలిటెంట్ల మధ్య కుదిరిన నాలుగు రోజుల కాల్పుల విరమణ ఒప్పందం సోమవారం ముగిసింది. ఒప్పందంలో భాగంగా మిలిటెంట్లు ఇప్పటిదాకా మూడు విడతల్లో మొత్తం 58 మంది బందీలను విడుదల చేశారు. ఇజ్రాయెల్‌ అధికారులు 117 మంది పాలస్తీనియన్‌ ఖైదీలను జైలు నుంచి విడిచిపెట్టారు. నాలుగో విడత కింద స్థానిక కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి తర్వాత మరికొంత మంది బందీలను హమాస్‌ విడుదల చేయనున్నట్లు తెలిసింది.

దీనిపై సంబంధిత బందీల కుటుంబ సభ్యులకు ఇజ్రాయెల్‌ అధికారులు సమాచారం ఇచ్చారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరో రెండు రోజులపాటు పొడిగించడానికి ఇజ్రాయెల్, హమాస్‌ అంగీకరించాయని ఖతార్‌ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి సోమవారం వెల్లడించారు. ఒప్పందం పొడిగింపు అమల్లో ఉన్నన్ని రోజులు నిత్యం అదనంగా 10 మంది చొప్పున బందీలను హమాస్‌ వదిలేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఇరుపక్షాలు ముందుగానే ఒక అవగాహనకు వచ్చాయి. ఇజ్రాయెల్, హమాస్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించే విషయంలో ఈజిప్టు, ఖతార్‌ ప్రత్యేకంగా చొరవ తీసుకున్నాయి.  

ఇజ్రాయెల్‌లో ఎలాన్‌ మస్క్‌ పర్యటన  
సోషల్‌ మీడియాలో యూదు వ్యతిరేక పోస్టులు పెట్టి విమర్శల పాలైన ‘ఎక్స్‌’ అధినేత ఎలాన్‌ మస్క్‌ సోమవారం ఇజ్రాయెల్‌లో పర్యటించారు. అక్టోబర్‌ 7న హమాస్‌ దాడిలో ధ్వంసమైన కిబుట్జ్‌ పట్టణాన్ని దర్శించారు. అక్కడి పరిస్థితిన పరిశీలించారు. ఈ సందర్భంగా మస్క్‌ వెంట ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు కూడా ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement