హమాస్‌కు ఎదురు దెబ్బ.. ఇజ్రాయెల్‌ మెరుపు దాడిలో Ismail Haniyeh Family Dead On Israel Air Attack | Sakshi
Sakshi News home page

హమాస్‌కు ఎదురు దెబ్బ.. ఇజ్రాయెల్‌ మెరుపు దాడిలో

Published Tue, Jun 25 2024 10:06 PM | Last Updated on Wed, Jun 26 2024 11:24 AM

 Ismail Haniyeh Family Dead On Israel Air Attack

హమాస్‌కు ఎదురు దెబ్బ తగిలింది. మంగళవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో హమాస్‌కు చీఫ్‌ ఇస్మాయిల్ హనియే సోదరితో సహా అతని 10 మంది కుటుంబ సభ్యులు మరణించారని గాజా మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.  

ఉత్తర గాజా స్ట్రిప్‌లోని అల్ షాతీ శరణార్థి శిబిరంలోని హనియే నివాసంపై దాడి జరిగిందని హమాస్ పాలిత ప్రాంతం పౌర రక్షణ ప్రతినిధి మహమూద్ బసల్ తెలిపారు.
  
శిథిలాల కింద అనేక మృతదేహాలు ఇంకా ఉన్నాయని, అయితే వాటిని వెలికితీసేందుకు అవసరమైన పరికరాలు తమ వద్ద లేవని ఆయన అన్నారు. సివిల్ డిఫెన్స్ సిబ్బంది మృతదేహాలను సమీపంలోని గాజా సిటీలోని అల్ అహ్లీ ఆసుపత్రికి తరలించారు.దాడిలో చాలామంది గాయపడినట్లు నివేదించారు.

కాగా,గాజాలో ఈద్ వేడుకల నుండి తిరిగి వస్తున్న వారిపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే పిల్లలు, మనవళ్లతో సహా 14 మంది చనిపోయారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement