India-UK Free Trade Agreement: స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సిద్ధం | India-UK FTA: Keir Starmer tells PM Modi in first call as UK PM | Sakshi
Sakshi News home page

India-UK Free Trade Agreement: స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సిద్ధం

Published Sun, Jul 7 2024 5:21 AM | Last Updated on Sun, Jul 7 2024 5:21 AM

India-UK FTA: Keir Starmer tells PM Modi in first call as UK PM

మోదీతో బ్రిటన్‌ నూతన ప్రధాని స్టార్మర్‌ ఫోన్‌ సంభాషణ

లండన్‌: భారత్‌– బ్రిటన్‌ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్‌టీఏ) ఆచరణలోకి తెచ్చేందుకు సిద్ధమని బ్రిటన్‌ నూతన ప్రధాని కియర్‌ స్టార్మర్‌ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీతో శనివారం ఆయన ఈ మేరకు ఫోన్లో చర్చలు జరిపినట్టు బ్రిటన్‌ ప్రకటించింది. ఆర్థిక బంధాన్ని బలోపేతం చేయడానికి, ఇరు దేశాల ప్రజల వికాసానికి కట్టుబడి ఉన్నామని మోదీ ట్వీట్‌ చేశారు.

 వాతావరణ మార్పులు, ఆర్థికాభివృద్ధి అంశాల్లో మోదీ నాయకత్వాన్ని స్టార్మర్‌ స్వాగతించారని ప్రధాని కార్యాలయం తెలిపింది. 2030 రోడ్‌మ్యాప్‌పై ప్రధానులు చర్చించారని, పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి అంగీకరించారని వెల్లడించింది. త్వరలో భేటీ అవాలని నేతలిద్దరూ నిర్ణయించారు. 38.1 బిలియన్‌ పౌండ్ల ద్వైపాక్షిక వాణిజ్య భాగస్వామ్యంపై భారత్, బ్రిటన్‌ 2022 నుంచి సంప్రదింపులు జరుపుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement